45th Chess Olympiad PM Modi : హంగేరీలోని బుడాపెస్ట్ వేదికగా జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల చెస్ జట్లు అద్భుతాలు సృష్టించాయి. దేశానికి రెండు స్వర్ణాలను అందించాయి. ఈ నేపథ్యంలో వీరికి ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువ మొదలైంది. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చెస్ ఛాంపియన్స్‌ను అభినందించారు.
"భారత క్రీడా రంగంలో సరికొత్త అధ్యాయం లిఖించారు. భవిష్యత్తు తరాలకు ఎంతో స్ఫూర్తినిచ్చేలా ఉంది. చెస్‌ను మరింతమంది కెరీర్‌గా మలుచుకొనేందుకు మార్గం చూపించారు. విజేతగా నిలిచిన ప్రతీఒక్కరికీ శుభాకాంక్షలు" అంటూ యంగ్ ప్లేయర్స్‌ను కొనియాడారు.
Historic win for India as our chess contingent wins the 45th #FIDE Chess Olympiad! India has won the Gold in both open and women’s category at Chess Olympiad! Congratulations to our incredible Men's and Women's Chess Teams. This remarkable achievement marks a new chapter in… pic.twitter.com/FUYHfK2Jtu
— Narendra Modi (@narendramodi) September 22, 2024
'లాస్ట్ టైమ్ మిస్ - ఈ సారి మాత్రం అలా అవ్వలేదు'
భారత చెస్ ప్లేయర్లు సాధించిన ఈ చారిత్రాత్మక విజయం తర్వాత, భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మన ఛాంపియన్స్‌ను అభినందించారు. ఓ చెస్ గ్రాండ్‌మాస్టర్‌గా, ఈ ఒలింపియాడ్‌లో భారత జట్టు స్వర్ణ పతకం సాధించడం చాలా సంతోషంగా, గర్వంగా ఉందని అన్నారు.
"ఈ సిరీస్‌లో భారత జట్టు ఒక్క మ్యాచ్ మినహా మిగతా అన్ని మ్యాచ్‌ల్లోనూ అద్భుత ప్రదర్శన చేసింది. ముఖ్యంగా అర్జున్, గుకేష్‌లు జట్టు తరఫున అద్భుతంగా ఆడారు. భారత జట్టు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థి జట్లు రాణించాయి. కానీ వారితో పాటు భారత జట్టు రాణించి విజయాన్ని నమోదు చేసింది. రెండేళ్ల క్రితం మిస్ అయిన అవకాశాన్ని ఈసారి పూర్తిగా సద్వినియోగం చేసుకుని గోల్డ్ మెడల్ సాధించాం. భారత జట్టు బాగా ఆడి పతకం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది.
'చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణం సాధించిన భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఓవరాల్‌గా భారత జట్టు చాలా బాగా ఆడింది. మరే జట్టుతోనూ పోల్చలేని విధంగా భారత ప్లేయర్లు ఈరోజు ఆడారు. ఈ సారి భారత మహిళల జట్టు కూడా మంచి ప్రదర్శన చేసింది. అయితే కొన్ని పొరపాట్లు చేసినా కూడా వాటి వల్ల ఆటను ఆపకుండా బాగా ముందుకు సాగారు. మహిళా జట్టు కోచ్ చక్కటి కోచింగ్, నాయకత్వం ఇస్తున్నారు. మనమందరం తనను అభినందించాలి. ఇరు జట్లకు నా అభినందనలు." అంటూ విశ్వనాథన్ ఆనంద్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Congrats to Team India for winning the last round as well! Sensational @DGukesh and @ArjunErigaisi, but also congrats to @viditchess on an impressive result. Great captaincy by @srinathchess.@FIDE_chess https://t.co/RYQsUT4zYw
— Viswanathan Anand (@vishy64theking) September 22, 2024
చరిత్ర సృష్టించిన భారత్ - ఒలింపియాడ్‌లో డబుల్ స్వర్ణాలు! - Chess Olympiad 2024
'నా విజయంలో అతిపెద్ద కీలక పాత్ర ఆయనదే' - Fide Candidates 2024 Gukesh