ETV Bharat / entertainment

ఆ రోజు కాజోల్ లేకుంటే నేను చనిపోయేవాడిని : షారుక్ ఖాన్ - Shahrukh Khan Dilwale Movie

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Shah Rukh Khan Gerua Accident : బాలీవుడ్ సినీపరిశ్రమలో షారుక్ ఖాన్- కాజోల్ జోడీకి మంచి క్రేజ్ ఉంటుంది. వీరిద్దరినీ ఐకానిక్ జోడీ అనే పేరు కూడా ఉంది.1995 నుంచి 2015వరకూ ఎన్నో సినిమాల్లో కలిసి నటిస్తూ కనువిందూ చేశారీ జంట. అయితే ఒకానొక సమయంలో కాజోల్ లేకపోయుంటే షారుక్ చనిపోయేవాడని మీకు తెలుసా?

Shah Rukh Khan Gerua Accident
Shah Rukh Khan Gerua Accident (Getty Images)

Shah Rukh Khan Gerua Accident : బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్, కాజోల్ కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేం లేదు. దశాబ్దానికి పైగా ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన వీళ్లని సినీ లవర్స్ ముద్దుగా బాలీవుడ్ ఐకానిక్ కపుల్​గా చెప్పుకుంటుంటారు. అప్పట్లో వీరిద్దరినీ కలిపి స్క్రీన్ మీద చూసేందకు థియేటర్ల ముందు యూత్ క్యూ కట్టేవారు. 1993లో 'బాజీగర్' చిత్రంతో మొదలైన వీరి ప్రయాణం 2015లో విడుదలైన 'దిల్​వాలే' వరకూ సాగింది. వీరిద్దరూ నటించిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్లుగానూ నిలిచి బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు సాధించాయి. ఈ క్యూట్ కపుల్ గురించి చాలా మందికి తెలియని ఓ ఆసక్తికర విషయం ఏంటంటే ఒకానొక సమయంలో కాజోల్ లేకపోయుంటే షారుక్ ఓ ప్రమాదంలో ఇరుక్కునే వారట. కాజోల్ తన ప్రాణాలను కాపాడిందని ఇందుకు తనకు ఎప్పుడూ రుణపడి ఉంటానంటూ షారుక్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అసలు ఏం జరిగిందంటే?

2010లో విడుదలైన 'మై నేమ్ ఈజ్ ఖాన్' తర్వాత ఐదేళ్ల పాటు తెర మీద కనిపించని ఈ జంట, 2015లో తిరిగి 'దిల్ వాలే' అనే సినిమాలో నటించారు. రోహిత్ శెట్టి డైరెక్షన్​లో రూపొందిన ఈ చిత్రంలో షారుక్ ఖాన్, కాజోల్​తో పాటు వరుణ్ ధావన్, కృతి సనన్​ కూడా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ అందుకోకపోయినా, ఇందులోని సాంగ్స్ మ్యూజిక్ లవర్స్​ను తెగ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'గేరువా' అనే సాంగ్​లో షారుక్- కాజల్ కెమిస్ట్రీ చూసి పాత రోజులను గుర్తుచేసుకున్నారు వారి అభిమానులు. కానీ ఈ పాట షూటింగ్ సమయంలో మూవీ టీమ్​ చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందట. చిత్రీకరణ సమయంలో షారుక్ ఓ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారట.

సినిమా విడుదలకు ముందే 'గెరువా' పాట షూటింగ్​కు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్​ను విడుదల చేశారు మేకర్స్. ఆ సమయంలో షారుక్ , కాజోల్ సహా దర్శకుడు రోహిత్ శెట్టి, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్​ల మధ్య జరిగిన హస్య సన్నివేశాలను, ఇబ్బందులను చూపిస్తూ మేకర్స్​ ఈ వీడియోను విడుదల చేశారు. అందులో షారుక్ ప్రాణాలను కాజోల్ కాపాడిన క్లిప్ కూడా ఉంటుంది.

ఇదే కాకుండా అప్పట్లో ఓ ఇంటర్వ్యూలోనూ షారుక్ ఆ ఇన్సిడెంట్​ను గుర్తు చేసుకున్నారు. కాజోల్ తన ప్రాణాలను కాపాడారంటూ షారుక్ చెప్పుకొచ్చారు. అక్కడే ఉన్న కాజోల్ కూడా "అవును ఆ రోజు సరైన సమయంలో నిన్ను పట్టుకుని ఉండకపోతే నువ్వు జలపాతంలో పడిపోయే వాడివి ఇప్పుడిలా బ్రతికి ఉండేవాడివి కాదు" అంటూ సరదాగా అన్నారు. దానికి బాద్​షా "ఆ రోజు నా ప్రాణాలను కాపాడినందుకు చాలా ధన్యవాదాలు. నువ్వు నా రుణం తీర్చుకున్నావ్. ఇందుకు నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఇప్పుడు నా జీవితం నీది" అంటూ నవ్వుతూ బదులిచ్చారు.

షారుక్ ఖాన్ కాళ్లు మొక్కిన హీరో రానా - కింగ్ ఖాన్ రియాక్షన్ ఏంటంటే? - Rana Touches Shah Rukh Khan Feet

షారుక్, కాజోల్ కాదు - బీటౌన్​లో ఈ హిట్​ పెయిరే ఫేమస్​! - Actress Most Films With Shahrukh

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.