ETV Bharat / spiritual

ఆ రాశివారు బీకేర్​ఫుల్​- సన్నిహితులతో గొడవలు వచ్చే అవకాశం! - Daily Horoscope In Telugu

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Horoscope Today 22nd September 2024 : 2024 సెప్టెంబర్ 22వ తేదీ (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)

Horoscope Today 22nd September 2024 : 2024 సెప్టెంబర్ 22వ తేదీ (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా పూర్తి ఉత్సాహంగా, ఆనందంగా ఉంటారు. అన్ని రంగాల వారికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి కావడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. సంపదలు కలిసి రావడం వల్ల కుటుంబ వాతావరణం కూడా ఆనందభరితంగా ఉంటుంది. స్నేహితులు, ప్రియమైన వారిని కలుసుకుంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొన్ని అనుకోని సంఘటనల కారణంగా మీ మానసిక స్థితి గందరగోళంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు పనులకు ఆటంకాలుగా మారుతాయి. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశాలున్నాయి. సన్నిహితులతో విభేదాలు ఏర్పడవచ్చు. ఆర్ధిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. దైవబలంతో, మనోనిబ్బరంతో సమస్యలను అధిగమిస్తారు. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మిథునం (Gemini) : మిధున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అన్నిరంగాల వారు వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. స్నేహితుల ద్వారా ఆర్ధికంగా లబ్ధి పొందుతారు. ఆర్ధికంగా ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. ప్రయాణాలు అనుకూలం. కాంట్రాక్టర్లకు, వ్యాపారస్తులకు ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలు కూడా అందుతాయి. ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగత, వృత్తి సంబంధిత వ్యవహారాల గురించి ఈ రోజు ముఖ్యులతో చర్చిస్తారు. దీర్ఘకాలిక భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. అందరి సహకారంతో కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగులకు అధిక పనిభారం కారణంగా అలసట ఉండవచ్చు. మిత్రుల సహకారంతో పనిభారం తగ్గుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని సరదాగా గడుపుతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు పని ఒత్తిడి కారణంగా మానసిక, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. క్షణికావేశం కారణంగా గొడవలు, వివాదాలు ఏర్పడవచ్చు. మీ కోపాన్ని, దూకుడును తగ్గించుకుంటే మంచిది. వ్యాపారంలో లాభాలు తగ్గడం, ఖర్చులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకోవడం వల్ల నిరాశకు లోనవుతారు. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. ప్రకృతి సౌందర్య ప్రదేశాలలో పర్యటించే అవకాశం ఉంది. వివాదాలు ఏర్పడకుండా చూసేందుకు మీ మాటను అదుపులో పెట్టుకోండి. ఆరోగ్యం కూడా స్వల్పంగా ఇబ్బంది పెడుతుంది. ఈ రోజు శుభకార్యాలు, ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. నవగ్రహ స్తోత్ర పరాయణంతో శుభ ఫలితాలు ఉంటాయి.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈరోజు ప్రారంభించిన అన్ని పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. సమయానుకూలంగా వ్యవహరించి కీలకమైన వ్యవహారాలలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తారు. ఆర్ధిక వ్యవహారాల్లో ఆచి తూచి నడుచుకోవాలి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. శత్రువుల నుంచి ప్రమాదం ఏర్పడే సూచనలు ఉన్నాయి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండండి. ఆర్థిక లాభాలు ఆశించిన మేరకు ఉంటాయి. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి మేథోపరమైన అలాగే సామాజిక పరమైన చర్చల్లో పాల్గొంటారు. నూతన ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకోవడానికి, కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఈ రోజు శుభకరంగా ఉంది. అదృష్టం వరించి పట్టిందల్లా బంగారం అవుతుంది. గత కొన్ని రోజులుగా ఇబంది పెట్టిన సమస్యల నుంచి బయట పడతారు. కుటుంబ సభ్యులతో విందు వినోదాలలో పాల్గొంటారు. గణపతి ఆలయ సందర్శన శుభకరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజు ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది, కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. వృత్తివ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆర్ధికంగా మెరుగైన ఫలితాల కోసం సహనంతో వేచి చూస్తే మంచిది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో శుభ ఫలితాలు ఉంటాయి.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారు ఈ రోజు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. లేకుంటే చిక్కుల్లో పడతారు. ఆస్తులు, భూములకు సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ముఖ్యమైన వ్యవహారాల్లో మొండి పట్టుదలకు పోకుండా పట్టువిడుపుల ధోరణిని అవలంబించండి. శని స్తోత్రం పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. కొత్త పనులు, ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉత్సాహం చూపిస్తారు. ముఖ్యమైన విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. సమయానుకూలంగా వ్యవహరిస్తే మంచిది. రచయితలకు, కళాకారులకు మంచి సమయం. సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. సన్మాన సత్కారాలను అందుకుంటారు. కుటుంబ సమస్యల పట్ల ఆచి తూచి వ్యవహరించాలి. సహనంతో ఉంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. శ్రీలక్ష్మీదేవి ధ్యానం శుభప్రదం.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో తీరిక లేకుండా ఉంటారు. కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం అవసరం. కుటుంబ సమస్యల పరిష్కారానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. విందు వినోదాల కోసం అధిక ధనవ్యయం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.