Honda First Electric Scooter: ప్రస్తుతం రోడ్లపై ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలే కన్పిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వీటికి డిమాండ్ పెరుగుతూనే ఉంది. పర్యావరణానికి అనుకూలంగా ఉండటంతో వీటిని వాడేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఫ్యూయెల్ ధరలు బాగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఆశ్చర్యకరమైన వేగంతో అభివృద్ధి చెందుతోంది.
వీటిలో ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి క్రేజ్ ఉంది. మార్కెట్లో వీటి సేల్స్ మంచి జోరందుకోవడంతో ప్రముఖ వాహన తయారీ సంస్థలు అన్నీ విద్యుత్ స్కూటర్ల రిలీజ్‌పై ఫోకస్ చేస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను రిలీజ్ చేయగా.. తాజాగా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా ఈ సెంగ్మెంట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది.
త్వరలో ఓ విద్యుత్ స్కూటర్‌ను లాంచ్ చేయబోతున్నట్లు హోండా ప్రకటించింది. ఈ మేరకు తాజాగా ఓ టీజర్‌ను రిలీజ్ చేసింది. కంపెనీ రిలీజ్ చేసిన ఈ టీజర్‌ను చూస్తే దీని లుక్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. లుక్ పరంగా పెద్దగా మార్పులేవీ లేకుండానే హోండా యాక్టివా మోడల్లోనే విద్యుత్ స్కూటర్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంటే దీని పాత మోడల్‌నే ఈవీ రూపంలో తీసుకొచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ వంటి అంకుర సంస్థలు విద్యుత్ స్కూటర్ల విభాగంలో దూసుకెళ్తున్నాయి. మరోవైపు బజాజ్, టీవీఎస్ వంటి సంప్రదాయ ఆటోమొబైల్ సంస్థలూ చేతక్, ఐక్యూబ్ మోడళ్లతో మెరుగైన సేల్స్ నమోదు చేస్తున్నాయి. కాస్త ఆలస్యం అయినా హీరో మోటోకార్ప్ సంస్థ విడా పేరిట ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చింది.
ఈ క్రమంలోనే హోండా నుంచి కూడా త్వరలోనే విద్యుత్ స్కూటర్‌ను తీసుకురాబోతోందంటూ కొన్ని నెలలుగా వార్తల చక్కర్లు కొట్టాయి. అన్నట్లుగానే ఎలక్ట్రిక్ స్కూటర్‌పై కంపెనీ నుంచి ఈ ప్రకటన వెలువడింది. ఈ ఈవీ త్వరలోనే మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. హోండా ఎంట్రీతో ఎలక్ట్రిక్ టూ-వీలర్ సెగ్మెంట్లో పోటీ మరింత ఎక్కవ కానుంది. అయితే దీని ధర, ఫీచర్లు వంటి వాటిపై కంపెనీ ఎలాంటి సమాచారం అందించలేదు. దీని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
'ఫస్ట్ ఇన్ ఇండియా'- కొత్త సర్వీస్ తెచ్చిన BSNL- వారికి 500 లైవ్‌టీవీ ఛానల్స్ ఫ్రీ!
కొత్త కారు కొనాలా?- అయితే మారుతి డిజైర్‌పై ఓ లుక్కేయండి- వేరియంట్ వారీగా ఫీచర్లు ఇవే..!