ETV Bharat / sports

బోర్డర్ గావస్కర్ ట్రోఫీ - కోహ్లీ, రోహిత్ ఫామ్‌పై మైండ్‌ గేమ్‌ స్టార్ట్ - BORDER GAVASKAR TROPHY KOHLI ROHITH

కోహ్లీ, రోహిత్ ఫామ్‌పై మైండ్‌ గేమ్‌ స్టార్ట్ చేసిన ఆసీస్​ మాజీ ప్లేయర్స్!

AUS VS IND Kohli Rohith
AUS VS IND Kohli Rohith (Source ETV Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 13, 2024, 6:46 PM IST

AUS VS IND Kohli Rohith : బోర్డర్​ గావస్కర్​ ట్రోఫ్రీ 2024-25 సమరం మరో 8 రోజుల్లో ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా - భారత జట్ల మధ్య దాదాపు 30 ఏళ్ల తర్వాత ఐదు టెస్టుల సిరీస్‌ జరగనుంది. దీంతో ఆసీస్​ గడ్డపై బోర్డర్ - గావస్కర్ ట్రోఫీని మూడోసారి దక్కించుకోవాలనే పట్టుదలతో భారత జట్టు అక్కడికి వెళ్లింది. కానీ కెప్టెన్ రోహిత్​ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఫామ్‌పై క్రికెట్ ఫ్యాన్స్​లో ఆందోళన నెలకొంది. గత కొద్ది కాలంగా ఈ ఇద్దరు పెద్దగా ఫామ్​లో లేరు. అయితే ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్స్​ ఇప్పటికే విరాట్​ - హిట్​మ్యాన్​ ఫామ్​పై మైండ్‌ గేమ్ మొదలు పెట్టారు.

రీసెంట్​గానే విరాట్​ ఫామ్‌పై రికీ పాంటింగ్ స్పందిస్తూ ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్​కు కౌంటర్ వేశాడు. ఇప్పుడేమో తాజాగా ఆసీస్​ మాజీ క్రికెటర్ కెర్రీ ఓ కీఫె కూడా ఇదే పని చేశాడు. కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే, బ్యాటింగ్‌లో అతడు బలహీనంగా కనిపిస్తున్నాడని కామెంట్లు చేశాడు. హిట్​ మ్యాన్​ను లక్ష్యం చేసుకొని ఆసీస్‌ బౌలర్లు బౌలింగ్‌ చేస్తారని పేర్కొన్నాడు.

"హిట్ మ్యాన్​ మొదటి టెస్టు మ్యాచ్​కు మిస్‌ అవుతాడని సమాచారం అందింది. అతడు టీమ్ ఇండియా కెప్టెన్. అతడు ఎప్పుడు బరిలోకి దిగినా ఆసీస్​ బౌలర్లు మిస్సైల్‌లా దూసుకుపోయి హిట్​మ్యాన్​కు అడ్డుకట్ట వేసేందుకు ట్రై చేస్తారు. ఈ సిరీస్‌ రోహిత్‌కు కష్టంగా మారొచ్చు. విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే బెస్ట్ ప్లేయర్. గత కొన్నేళ్లుగా అతడు ఆసీస్‌ను కలవరపెట్టే బ్యాటర్​గా రాణిస్తున్నారు. కానీ ఇప్పుడు అతడు కాస్త బలహీనంగానే కనిపిస్తున్నాడు. ఈ సిరీస్‌ను విరాట్​ ఎలా ముగిస్తాడో చూడాలని ఆసక్తిగా ఉంది. ఒకవేళ అతడు ఆధిపత్యం ప్రదర్శిస్తే, భారత్‌ విజేతగా నిలవడం ఖాయం" అని కీఫె పేర్కొన్నాడు.

బోర్డర్ గావస్కర్​ షెడ్యూల్ ఇదే - భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ 2024 - 25 సిరీస్‌ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్టు నవంబర్‌ 22 - 26 (పెర్త్‌లో); రెండో టెస్టు డిసెంబరు 6 - 10 (అడిలైడ్‌లో డే & నైట్‌); మూడో టెస్టు డిసెంబరు 14 -18 (బ్రిస్బేన్‌లో); నాలుగో టెస్టు డిసెంబరు 26 - 30 (మెల్‌బోర్న్‌లో); ఐదో టెస్టు జనవరి 3 - 7 (సిడ్నీలో) వరకు జరగనున్నాయి. గతేడాది వరకు నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌గా కొనసాగిన ఈ ట్రోఫీ, ఈ సారి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌గా నిర్వహించనున్నారు.

బోర్డర్ గావస్కర్ ట్రోఫీ - షమీ కెరీర్ బెస్ట్ గణాంకాలు ఇవే

ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించకపోతే PCBకి కలిగే నష్టం ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.