ETV Bharat / offbeat

కోడిగుడ్లపై పెంకులు తొలగించడం కష్టంగా ఉందా? - ఈ చిట్కాలు తెలిస్తే క్షణాల్లో తీసేయొచ్చు! - Best Cooking Hacks to Save Time - BEST COOKING HACKS TO SAVE TIME

Best Cooking Hacks: చాలా మంది ఆడవాళ్లు వంట పని అనగానే.. నీరసించి పోతుంటారు. డైలీ చేసే పనే అయినా ఏదో భారంగా ఫీల్ అవుతుంటారు. అలాంటి వారికోసం కొన్ని సింపుల్ కుకింగ్ టిప్స్ పట్టుకొచ్చాం. వాటిని ఫాలో అయితే వంట త్వరగా పూర్తి కావడమే కాదు.. సమయం ఆదా అవుతుందంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఇప్పుడు చూద్దాం.

Cooking Hacks to Save Time
Best Cooking Hacks (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Sep 22, 2024, 4:20 PM IST

Best Cooking Hacks to Save Time: రోజూ చేసే పనే అయినా.. వంట అనగానే నీరసించి పోతారు చాలా మంది ఆడవారు. ‘ఏది తప్పినా ఇది మాత్రం తప్పదు!’ అంటూ అసహనానికి గురయ్యే వారూ లేకపోలేదు. అయితే.. అదో పెద్ద పనిలా భావించకుండా వంట త్వరగా పూర్తి కావాలంటే కొన్ని టిప్స్ తెలిసి ఉండాలంటున్నారు నిపుణులు. తద్వారా సమయం ఆదా అవడంతో పాటు శ్రమ తగ్గి కాస్త విశ్రాంతి కూడా దొరుకుతుందని చెబుతున్నారు. మరి, ఇంతకీ ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఉల్లిపాయ పొట్టు ఈజీగా వచ్చేస్తుందిలా!: మనం డైలీ చేసుకునే అన్ని వంటలలో దాదాపుగా ఉల్లిపాయను ఉపయోగిస్తుంటాం. అయితే, కొన్నిసార్లు దీన్ని కట్ చేసుకునేటప్పుడు చాలా టైమ్ వృథా అవుతుంటుంది. ముఖ్యంగా ఆనియన్స్ పై పొట్టు అంత ఈజీగా రాదు. ఇక అదే చిన్న సైజ్​ ఉల్లిపాయలైతే మరింత ఎక్కువ టైమ్ కేటాయించాల్సిందే. అలాకాకుండా.. ఈ ట్రిక్​తో ఉల్లిపాయల పై పొట్టు ఈజీగా తొలగించుకోవచ్చంటున్నారు నిపుణులు. అదేంటంటే.. ముందుగా ఆనియన్స్ రెండు చివర్లు కట్ చేయాలి. ఆపై వాటిని కాసేపు వేడినీటిలో ఉంచి తర్వాత తీస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుందంటున్నారు.

గుడ్డు పెంకులు తొలగించుకోండిలా..: కొన్నిసార్లు ఉడికిన గుడ్లపై పెంకులు తొలగించడం కష్టంగా ఉంటుంది. అలాంటి టైమ్​లో గుడ్లను ఉడికించేటప్పుడే ఆ నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా లేదంటే వెనిగర్ వేస్తే పెంకులు తీయడం సులువవుతుందంటున్నారు. లేదంటే.. గుడ్లు ఉడికాక వాటిని కాసేపు చల్లని ఐస్ క్యూబ్స్ ఉన్న కంటెయినర్​లో వేయండి. తర్వాత పెంకులు తొలగిస్తే ఈజీగా వచ్చేస్తాయట.

టమాటా తొక్క విషయంలో..: కొన్ని వంటకాల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు టమాటాపై ఉండే తొక్క తొలగిస్తుంటాం. ఈ పని ఈజీగా పూర్తవ్వాలంటే టమాటాల్ని ముందు పావుగంట పాటు మరిగే నీళ్లలో వేసి.. ఆ తర్వాత ఐస్‌ నీళ్లలో పూర్తిగా చల్లారేంత వరకు వేసి ఉంచితే సరిపోతుందంటున్నారు నిపుణులు.

ఆకుకూరల విషయంలో..: కొత్తిమీర, పుదీనా, మెంతి.. వంటివి తరుక్కునే టైమ్ ఉండచ్చు.. ఉండకపోవచ్చు! అలాంటి సందర్భాల్లో.. మట్టి ఉన్నంత వరకు వాటి కాడలు కట్‌ చేసి.. ఓ గ్లాస్‌ నీటిలో కాడలు మునిగేలా ఉంచి ఫ్రిజ్‌లో ఉంచండి. లేదంటే హెర్బ్ సేవర్స్​ని ఉపయోగించవచ్చు. తద్వారా కొన్ని రోజుల పాటు అవి తాజాగా ఉంటాయి. మీకు కావాల్సినప్పుడల్లా కావాల్సినంత కూరల్లో తరిగి వేసుకుంటే సరిపోతుంది!

చికెన్ విషయంలో.. మనలో చాలా మంది కొన్ని సందర్భాల్లో చికెన్‌ని తీసుకొచ్చి ఫ్రిజ్‌లో ఉంచుతారు. ఇలాంటి చికెన్ ఉడకడానికి ఎక్కువ టైమ్​ పడుతుంది. అందుకోసం చికెన్‌ని బయట పెట్టి ఎక్కువ సమయం వృథా చేయాల్సిన పనిలేదు. అలాకాకుండా.. చికెన్​ కర్రీ చేసే ముందు దాన్ని ముక్కలుగా కట్ చేసి ఒకసారి ఉడికించండి. ఆపై కర్రీ చేసుకుంటే చికెన్ త్వరగా ఉడుకుతుందంటున్నారు.

ఇవి ఇలా స్టోర్ చేసుకోండి : చాలా మంది వారానికి లేదంటే మూడు రోజులకు సరిపడా దోసె/ఇడ్లీ పిండి రెడీ చేసుకుని ఫ్రిజ్​లో స్టోర్ చేసుకుంటుంటారు. అయితే.. ఇలా స్టోర్ చేసుకునేటప్పుడు మొత్తం పిండిలో ఉప్పు కలపకుండా చూసుకోవాలి. అప్పుడే అది తాజా​గా ఉంటుంది! రోజూ మీకు కావాల్సినంత పిండి తీసుకొని తగినంత ఉప్పు/బేకింగ్‌ సోడా/ఇతర పదార్థాలు కలుపుకొని వాడుకుంటే సరిపోతుందంటున్నారు నిపుణులు.

ఇవీ చదవండి :

పప్పు వండే ముందు నానబెడుతున్నారా? - అసలు ఎందుకు నానబెట్టాలో మీకు తెలుసా?

ఆయిల్​ లేకుండా చిప్స్, అప్పడాలు ఇలా వేయించండి - రుచికి రుచీ.. ఆరోగ్యానికి ఆరోగ్యం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.