తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశివారికి ఈరోజు జలగండం! ఆంజనేయస్వామి ఆరాధన శుభప్రదం! - Daily Horoscope In Telugu - DAILY HOROSCOPE IN TELUGU

Horoscope Today 14th September 2024 : 2024 సెప్టెంబర్ 14వ తేదీ (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today 14th September 2024
Horoscope Today 14th September 2024 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2024, 5:00 AM IST

Horoscope Today 14th September 2024 : 2024 సెప్టెంబర్ 14వ తేదీ (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో గత కొంతకాలంగా నెలకొన్న సమస్యలు తగ్గు ముఖం పట్టి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక పరంగా ముఖ్యమైన చర్చలు ఫలవంతంగా వుంటాయి. మాతృవర్గం నుంచి ఆర్థిక లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో అధిక శ్రమ ఉండవచ్చు. సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి శుభసమయం. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగుల విదేశీయానానికి అవకాశం ఉంది. ఆర్థిక విషయాల పట్ల ఆచి తూచి వ్యవహరిస్తే మంచిది. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్తారు. దైవబలం మీద విశ్వాసం ఉంచితే విజయం మీదే! ఇష్ట దేవతారాధన శ్రేయస్కరం.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రతికూల ఆ0లోచనలతో ఏ పనిలోనూ ముందడుగు వేయలేకపోతారు. ముఖ్యమైన పనులు, కొత్త ప్రాజెక్టులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. కోపావేశాలను అదుపులో ఉంచుకోకపోతే సన్నిహితులతో కలహాలు ఏర్పడతాయి. ఖర్చులు అదుపు తప్పుతాయి. ఒత్తిడి అధిగమించేందుకు యోగా చెయ్యండి. శివ పంచాక్షరీ జపం చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ రోజంతా సరదాగా, సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని పనుల్లో సానుకూలత ఉంటుంది. ఊహించని ధనలాభాలను అందుకుంటారు. సామాజికంగా మంచి గుర్తింపు పొందుతారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళతారు. ముఖ్యమైన పనులు మొదలు పెట్టడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. శ్రీలక్ష్మీ గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో అనుకోని సవాళ్లు ఉండవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే విషయంలో సందిగ్దత నెలకొంటుంది. కుటుంబంలో నెలకొన్న ఉద్రిక్తత ఇబ్బంది కలిగించవచ్చు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శనిస్తోత్ర పరాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు సామాన్య ఫలితాలు వుంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఆటంకాల కారణంగా మానసిక ఒత్తిడికి లోనవుతారు. అవసరానికి ధనం అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. వ్యాపారాలు అప్పులు చేయాల్సివస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ రోజు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వైద్యచికిత్స కోసం డబ్బు మంచి నీళ్లలా ఖర్చవుతుంది. షేర్స్ లోనూ, స్టాక్స్ లోనూ పెట్టుబడులు పెట్టకండి. గణపతి ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఆటంకాల కారణంగా మానసికంగా విపరీతమైన ఒత్తిడి వుంటుంది. ఒక మహిళ కారణంగా ఈ రోజు మీరు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. జలాశయాలకు దూరంగా వుండండి. స్థిరాస్తి వ్యవహారాలు, వారసత్వపు ఆస్తి వ్యవహారాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అభయ ఆంజనేయస్వామి ఆరాధన శుభప్రదం.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. శుభసమయం నడుస్తోంది. కార్యసిద్ధి, విజయం మీ వెంటే ఉంటాయి. అంతటా విజయమే ఉండడం వల్ల సంతోషం విస్తరిస్తుంది. భూలాభం, వస్తు లాభాలు ఉంటాయి. వ్యాపారులు వ్యాపారాన్ని విస్తరిస్తారు. కొత్త వ్యాపారాలు మొదలుపెడతారు. సంపద వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాల వారికి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ఇంట్లో గొడవలు అశాంతిని కలిగిస్తాయి. ప్రయాణాలు అనుకూలం కాదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సహనంతో ఉంటే పరిస్థితులు చక్కబడతాయి. వివాదాలకు, వాదనలకు దూరంగా ఉండండి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ రోజు విశేషించి ఆధ్యాత్మిక సంబంధమైన కార్యకలాపాలలో గడుపుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూలం. మీ ప్రయత్నాలు, బాధ్యతలు, కర్తవ్యాలు అన్నీ ఫలిస్తాయి. సమాజంలో పరపతి పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభించే సూచనలున్నాయి. స్నేహితులు, బంధువులతో విహారయాత్రలకు వెళతారు. గృహంలో శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి. హనుమాన్ చాలీసా పారాయణ శుభకరం.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబంలో గొడవల కారణంగా అశాంతిగా ఉంటారు. ఆరోగ్యం సహకరించదు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. వృత్తి నిపుణులు, ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి సామాన్య ఫలితాలే ఉంటాయి. నూతన ఆదాయ వనరులపై దృష్టి సారిస్తారు. శని స్తోత్రం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇంటా బయటా తీరికలేని పనులతో అవిశ్రాంతంగా ఉంటారు. ఇంటి మరమ్మత్తుల కోసం అధిక ధన వ్యయం ఉంటుంది. ఉద్యోగుల కష్టానికి తగిన ప్రతిఫలం, ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారులకు వ్యాపారంలో ఆశించిన పురోగతి ఉండదు. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. శివాష్టకం పఠిస్తే మేలు జరుగుతుంది.

ABOUT THE AUTHOR

...view details