తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రెండు రాశుల వారికి నేడు తిరుగులేదు! అంతా శుభమే!! - DAILY HOROSCOPE

2024 డిసెంబర్​ 14వ తేదీ (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 14, 2024, 6:18 AM IST

Horoscope Today December 14th 2024 : డిసెంబర్​ 14వ తేదీ (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభ సమయం నడుస్తోంది. వృత్తి వ్యాపారాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్ధికంగా విశేష లాభాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి ఉంది. ఆస్తులకు సంబంధించిన ఆందోళన అధికంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అనుకూలమైన తారాబలం మీకు అదృష్టం తెస్తుంది. ప్రారంభించిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. పని పట్ల ఏకాగ్రత చిత్తశుద్ధి అవసరం. ఆర్థిక సంబంధమైన విషయాలకు ఈ రోజు మంచి రోజు. అన్ని వైపులా నుంచి ధనప్రవాహం ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శ్రీలక్ష్మీ ధ్యానం శుభకరం.

మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మీ కఠినమైన మాటలతో సన్నిహితులను బాధ పెడతారు. కుటుంబంలో ఒత్తిడి, అపార్థాలు, అనవసరమైన వివాదాలు జరుగుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకొని సమయానుకూలంగా నడుచుకోండి. ఆరోగ్య సంబంధమైన సమస్యలు తలెత్తవచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. నవగ్రహ శ్లోకాలు పఠించడం శ్రేయస్కరం.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వ్యాపార పరంగా ఆర్థికలబ్ధి, ఆదాయ అభివృద్ధి ఉంటాయి. వ్యాపారం కోసం నిధులు సమీకరించుకోడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శన శుభకరం.

సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సానుకూల ఆలోచనలతో, కృత నిశ్చయంతో పనిచేసి సామాజికంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. కుటుంబ సభ్యులతో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. పిత్రార్జితం కలిసి వస్తుంది. భూములు, ఆస్తులు కొనడానికి సరైన రోజు. గణపతి ప్రార్ధన మేలు చేస్తుంది.

కన్య (Virgo) :కన్యా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. భవిష్యత్ లో విజయాలు సాధించాలంటే బద్దకాన్ని వీడి కష్టించి పనిచేయాలి. వృత్తి ఉద్యోగాలలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా అధిగమిస్తారు. ఉద్యోగులు పై అధికారుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రత్యర్థులను తక్కువగా అంచనా వేయకండి. ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. ఎవరితోనూ వాదనల్లోకి దిగవద్దు. వివాదాలు, అనారోగ్యం, కోపం కారణంగా ప్రశాంతత లోపిస్తుంది. కోపావేశాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. అనుకోకుండా ఆర్థిక లాభం ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపిస్తారు. ఆంజనేయస్వామి దండకం పఠించడం ఉత్తమం.

వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా గడుస్తుంది. కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో సరదాగా, సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్ధికంగా ఎదగడానికి బాటలు వేసుకుంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఉంటుంది. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆర్ధికంగా అనుకూల సమయం. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి. ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. మనోబలం తగ్గకుండా చూసుకోండి. కొన్ని ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. తల్లిదండ్రులతో అభిప్రాయ భేదాలు తొలగించే ప్రయత్నం చేసుకుంటే మంచిది. వ్యాపారులు పోటీ దారులతో వాదనల్లోకి దిగవద్దు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం మనశ్శాంతినిస్తుంది. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. చంచలమైన మనసుతో కాకుండా హుందాగా వ్యవహరిస్తే కార్యసిద్ధి ఉంటుంది. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో లాభాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సన్నిహితులతో మంచి సమయాన్ని గడుపుతారు. శివారాధన శ్రేయస్కరం.

ABOUT THE AUTHOR

...view details