Horoscope Today 12th September 2024 :2024 సెప్టెంబర్ 12వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :మేష రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో తొందరపాటు పనికిరాదు. పనులు ఆలస్యమైనా విజయవంతంగా పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. తగిన విశ్రాంతి అవసరం. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లాభాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. కుటుంబంలో కలహపూరిత వాతావరణం ఉంటుంది. కోపాన్ని, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. నవగ్రహ శ్లోకాలు పారాయణ చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
వృషభం (Taurus) :వృషభ రాశి వారికి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ రోజు ప్రతి పనిలోనూ అప్రమత్తంగా ఉండడం అవసరం. సమయానుకూలంగా నడుచుకోండి. కోపం అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే ఒత్తిడి, అపార్థాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతోనూ , స్నేహితులతోనూ, అనవసరమైన వివాదాలు రావచ్చు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ఖర్చులు అదుపు తప్పుతాయి. ప్రయాణాలు అనుకూలం కాదు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మనోధైర్యంతో చేసే అన్ని పనులు విజయాన్ని తెచ్చి పెడతాయి. మీడియా కమ్యూనికేషన్ రంగాల వారికి ఈ రోజు మంచి యోగకరంగా ఉంటుంది. పదిమందిలో గుర్తింపు తెచ్చుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. వృత్తి వ్యాపార రంగాల వారికి ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఆర్ధిక వృద్ధి, కార్యసిద్ధి ఉంటాయి. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఇష్ట దేవతారాధన శుభకరం.
కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు శుభాకారంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు వ్యాపారపరంగా ఈ రోజు చాలా అదృష్టమైన రోజు. స్నేహితుల నుండి సహోద్యోగుల నుంచి సంపూర్ణ సహకారాలు అందుతాయి. ఉద్యోగులు కష్టించి పనిచేసి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ప్రేమ వ్యహారాలలో అనుకూలత ఉంది. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అభయ ఆంజనేయస్వామి ఆలయ సందర్శన శుభప్రదం.
సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు విజయవంతంగా ఉంటుంది. మీ విజయబాటలో ఉన్న అవరోధాలను తొలగించుకుంటారు. ఉద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. కొత్త పనులు, బాధ్యతలు చేపడతారు. అన్ని పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో రాబడి అధికంగా ఉంటుంది. కుటుంబ సంబంధాల విషయంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా జీవిత భాగస్వామి సహకారంతో సులభంగానే పరిష్కారమవుతుంది. ప్రయాణ సూచన ఉంది. గణపతి ఆలయ సందర్శన శుభకరం.
కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. మీ మొండితనం, కోపస్వభావం కారణంగా ఎంతో నష్టపోతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే వృత్తి పరంగా, వ్యక్తిగతంగా కూడా శత్రువులు పెరుగుతారు. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో సాధారణ ఫలితాలు ఉంటాయి. ఈ రోజు ఆస్తికి సంబంధించి లేదా కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. ఆర్థికపరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆలయ సందర్శనతో ప్రశాంతత దొరుకుతుంది.
తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ఎలాంటి టెన్షన్స్ లేని ప్రశాంతమైన రోజు. కుటుంబంతో విహార యాత్రలకు వెళ్లి సరదాగా గడుపుతారు. దైవదర్శనం కోసం తీర్థయాత్రలకు వెళతారు. అన్ని రంగాల వారికి గురుబలం అనుకూలంగా ఉన్నందున చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది. సంపద పెరుగుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం దొరుకుతుంది. సమస్యలన్నీ తీరి ప్రశాంతంగా ఉంటుంది. శ్రీ దుర్గాదేవి ధ్యానం శుభకరం.
వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గొప్ప వ్యక్తుల రచనలు నుంచి స్ఫూర్తి పొందుతారు. స్ఫూర్తిదాయక పుస్తకాల ప్రభావం ఈ రోజు మీలో అధికంగా ఉంటుంది. కొత్త వ్యాపారంలోకి మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ వ్యక్తిత్వాన్ని అందరూ ప్రశంసిస్తారు. దైవ దర్శనాలు, ఆర్ధిక ప్రయోజనాలు వంటి శుభఫలితాలతో రోజంతా ఆనందంగా ఉంటారు. మీ పనితీరుతో, మాటతీరుతో అందరికీ మార్గదర్శకంగా ఉంటారు. శివపంచాక్షరీ జపం మేలు చేస్తుంది.
ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపార రంగాల వారు అన్ని విషయాలలో ఆచితూచి అడుగు వేస్తే మంచిది. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం సహకరించదు. బంధువులతో కలహాలు సూచితం. కోపాన్ని అదుపులో పెట్టుకుంటే మంచిది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తగిన విశ్రాంతి అవసరం. హనుమాన్ చాలీసా పఠనం మేలు చేస్తుంది.
మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు ఈ రోజు అంత అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపార రంగాల వారు అన్ని విషయాలలో ఆచితూచి అడుగు వేస్తే మంచిది. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం సహకరించదు. బంధువులతో కలహాలు సూచితం. కోపాన్ని అదుపులో పెట్టుకుంటే మంచిది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తగిన విశ్రాంతి అవసరం. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది..
కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ రోజు విశేషంగా యోగిస్తుంది. ఈ రోజంతా ఆనందోత్సాహాలతో నిండి ఉంటుంది.మీ పట్టుదల, ఆత్మవిశ్వాసం కలిసికట్టుగా అద్భుతాలు సృష్టిస్తాయి. చేపట్టిన అన్ని పనులను సకాలంలో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఊహించని ధనలాభాలు ఉంటాయి. వ్యాపారులకు గతంలో రావలసిన బకాయిలు వసూలు అవుతాయి. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఈ రోజు శుభకరంగా ఉంది. ప్రభుత్వ నుంచి రుణాలు అందుకుంటారు. ఓ శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ రోజు ఆశాజనకంగా లేదు. చిన్న విషయాలకే బాధపడిపోతారు. వృత్తి వ్యాపారాలలో ఏర్పడే ప్రతికూల పరిస్థితుల కారణంగా నిరాశపూరిత ఆలోచనలు మనస్సు నిండా ఉంటాయి. పాజిటివ్ గా ఉండేందుకు ప్రయత్నించండి. కీలక విషయాలలో మొండిపట్టు వీడి రాజీధోరణి అవలంబిస్తే మంచిది. తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు నష్టాలను తీసుకు వస్తాయి. మానసిక ప్రశాంతత ఉండదు. చేసే పనిలో స్పష్టత లేనందున పనులు ఆలస్యం అవుతాయి. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.