Horoscope Today 11th September 2024 :2024 సెప్టెంబర్ 11వ తేదీ (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక అంశాలలో పురోగతి ఉంటుంది. అవసరానికి ధనం చేతికి అందుతుంది. బంధువులతో, కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని అపార్ధాలకు అవకాశం ఇవ్వద్దు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపిస్తారు. వ్యాపారులు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. శివారాధన శ్రేయస్కరం.
వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలమైన రోజు. అన్ని రంగాల వారికి విజయసిద్ధి ఉంటుంది. ఆర్థిక అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. అన్ని పనులు సకాలంలో పూర్తి కావడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. కీలకమైన విషయంలో చాకచక్యంతో వ్యవహరించి సమాజంలో పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. అనుకోకుండా ధనసంపదలు కలిసి వస్తాయి. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. దూరదేశాల నుంచి శుభ వార్త వింటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ రోజు విజయవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి, శత్రుజయం ఉంటాయి. ఉద్యోగులు పెండింగ్ పనులు పూర్తిచేస్తి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో అదనపు ఆదాయవనరులు సమకూరుతాయి. వృథా ఖర్చులు పెరగవచ్చు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగానే ఉంటారు. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ మేలు చేస్తుంది.
కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపార ఉద్యోగాలలో చురుగ్గా పనిచేసే విజయాలను అందుకుంటారు. గత కొంతకాలంగా ఉన్న ఆటంకాలు కూడా తొలగిపోతాయి. సంపద వృద్ధి చెందడం వ్లల ప్రతికూల ఆలోచనలు, తొలగిపోతాయి. వృత్తి నిపుణులు పనికి సంబంధించి బాధ్యతగా లేకపోతే నష్టం కలగవచ్చు. అపజయాల గురించి ఆలోచిస్తూ సమయం వృథా చేయకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే విజయం మీదే! హనుమాన్ చాలీసా పారాయణ శుభకరం.
సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. ప్రతికూల ఆలోచల కారణంగా కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో గొడవలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాల కారణంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. జలగండం ఉంది కాబట్టి జలాశయాలకు దూరంగా ఉండండి. ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ శ్రేయస్కరం.
కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సానుకూల ధృక్పధంతో ఉండడం వలన చేపట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి. వృత్తి నిపుణులు, ఉద్యోగులు నూతన అవకాశాలు అందుకుంటారు. గురువుల నుంచి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా లేకపోతే నష్టం వాటిల్లుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. కుటుంబ వ్యహారాలు సంబంధించి అనవసర ఆందోళనల కారణంగా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. మీ మొండి వైఖరి మీతో బాటు మిగతా వారినీ కష్టాల పాలు చేస్తుంది. వివేకంతో, అవగాహనతో మెలగడం అందరికి మంచిది. మీ కోపమే మీ ప్రధమ శత్రువు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి గొప్ప శుభ సమయం నడుస్తోంది. వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించి మంచి శుభవార్తలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది. వ్యాపారులకు ప్రయాణాలు కలిసివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు తొలగిపోయి ఆనందం చేకూరుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శన శుభప్రదం.
ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. మాటలను నియంత్రణలో పెట్టుకోలేని మీ అశక్తత కారణంగా సమస్యల్లో చిక్కుకుంటారు. మాటతీరును మార్చుకునే ప్రయత్నం చేయకపోతే రోజంతా వాదనలు, సంజాయిషీలతో గడపాల్సి ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఆందోళన కలిగిస్తాయి. తీవ్రమైన అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. శని స్తోత్రం పారాయణ చేస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.
మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు చాలా అద్భుతంగా ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. నిరుద్యోగులు, ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు మంచి అవకాశాలను అందుకుంటారు. స్నేహితుల నుంచి ఆశ్చర్యకరమైన బహుమతి అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కన్నా మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.
కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. సామాజిక సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు అన్నీ మీకు అనుకూలంగా జరుగుతాయి. వృత్తిపరంగా కూడా చక్కగా రాణిస్తారు. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఇది మీలో మరింత ఉత్సాహం నింపుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. శ్రీలక్ష్మి గణపతి ధ్యానం శుభప్రదం.
మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ రోజు గ్రహచారం అనుకూలంగా లేదు. ఉన్నతాధికారులతో సహనంతో వ్యవహరించకపోతే ప్రమాదం. ప్రతికూల ఆలోచనల కారణంగా పోటీదారులు, విరోధులతో వాగ్వాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవడం మంచిది. వ్యాపారంలో నష్ట సూచన ఉంది. తెలివిగా వ్యవహరిస్తే నష్ట తీవ్రత తగ్గవచ్చు. నవగ్రహ శ్లోకాలు పారాయణ చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.