తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశివారికి ఊహించని లాభాలు! కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి బెస్ట్​ టైమ్ ఇదే! - Horoscope Today 10th September - HOROSCOPE TODAY 10TH SEPTEMBER

Horoscope Today 10th September 2024 : 2024 సెప్టెంబర్ 10వ తేదీ (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today
Horoscope Today (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2024, 5:00 AM IST

Horoscope Today 10th September 2024 :2024 సెప్టెంబర్ 10వ తేదీ (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి విజయసిద్ధి ఉంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక అంశాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పదోన్నతులు, భూలాభం ఉంటాయి. దైవబలం అండగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారి పట్ల చూసీ చూడనట్లు వ్యవహరిస్తే మంచిది. అన్ని రంగాల వారు తమ తమ రంగాలలో పైచేయి సాధిస్తారు. మీ ప్రశాంతతకు భంగం కలిగే సంఘటనలు జరగవచ్చు. చివరకు విజయం సాధించేవి మీ మంచితనం, సత్ప్రవర్తనే! ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శివారాధన శ్రేయస్కరం.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గతంలో చేసిన తప్పులు పునరావృతం చేయకుండా ఉంటే వృత్తి ఉద్యోగాలలో రాణిస్తారు. వ్యాపారంలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి అభిప్రాయభేదాలు రావచ్చు. ప్రమోషన్, మార్కెటింగ్ రంగాల్లో ఉండేవారికి ఈ రోజు బాగా లాభదాయకంగా ఉంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి సామాన్యంగా ఉంటుంది. బద్దకాన్ని వీడి చిత్తశుద్ధితో, అంకితభావంతో పనిచేస్తే విజయం సిద్ధిస్తుంది. కొన్ని సంఘటనలు ఆందోళన కలిగించవచ్చు. సహచరుల సహకారంతో సమస్యలను అధిగమిస్తారు. కుటుంబ కలహాలు చికాకు పెడతాయి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. కుటుంబ సభ్యుల, సహచరుల అండతో చేసే పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. వ్యాపారంలో సమష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ఉద్యోగులు పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు అవిశ్రాంతంగా పనిచేస్తారు. సంపాదన పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణ మేలు చేస్తుంది.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులు, సన్నిహతులు, మిత్రుల అండతో చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ పెంచాలి. స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇది తగిన రోజు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభసమయం వచ్చేసింది. మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. వృత్తిపరంగా వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులను కలుసుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సమస్యలు కలహాలకు దారితీస్తాయి. సంయమనం పాటించడం అవసరం. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. హనుమ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ధైర్యంతో ముందడుగు వేస్తే కార్యసిద్ధి ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చిత్తశుద్ధితో పనిచేసి లక్ష్యాలను సాధిస్తారు. వ్యాపారులకు ఊహించని లాభాలుంటాయి. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త ప్రాజెక్టులు, వెంచర్లు మొదలు పెట్టడానికి మంచి రోజు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో పనిచేస్తే విజయావకాశాలుంటాయి. వృత్తి వ్యాపారాలలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తారు. ఉద్యోగంలో నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. కుటుంబంలో ఘర్షణ పూరిత వాతావరణం ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. వృథా ఖర్చులు నివారించాలి. ఆంజనేయస్వామి ఆలయ సందర్శనం మేలు చేస్తుంది.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు గొప్ప శుభయోగం ఉంది. పెద్దల సహకారంతో అన్ని పనులు సమర్ధవంతంగా పూర్తి చేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆదాయవృద్ధి కోసం మీరు చేసే కృషి ఫలిస్తుంది. అదనపు ఆదాయం సమకూరుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మీ గణపతి ఆలయ సందర్శన శుభకరం.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల ఆయా రంగాలలో ఆచి తూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాల వలన హాని కలగవచ్చు. పరోపకారానికి పోయి చిక్కుల్లో పడే ప్రమాదముంది. మొహమాటాలకు పొతే నష్టపోవాల్సి వస్తుంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఆందోళనకర పరిస్థితులు ఎదురవుతాయి. ధననష్టం కూడా ఉండవచ్చు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోండి. వ్యాపారంలో లాభాలు సామాన్యంగా ఉంటాయి. సహనం పాటించి, నమ్మకం ఉంచండి. అంతా మంచి జరుగుతుంది. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. అనారోగ్య సమస్యలుండవచ్చు. శనిస్తోత్ర పరాయణతో ప్రతికూలతలు తొలగిపోతాయి.

ABOUT THE AUTHOR

...view details