తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

"రోజూ ఉదయం, సాయంత్రం ఈ పనులు చేస్తే - ఆరోగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు పొందుతారు!" - ASTROLOGICAL REMEDIES FOR HEALTH

ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలంటే - రోజూ ఈ నియమాలు పాటించాలంటున్న జ్యోతిష్య నిపుణులు!

Astrological Remedies for Wealth
Astrological Remedies for Good Health (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 26, 2025, 5:25 PM IST

Astrological Remedies for Good Health :మనం జీవితంలో ఉన్నతమైన స్థానంలో స్థిరపడాలంటే డబ్బు కంటే కూడా ముఖ్యమైనది ఆరోగ్యం. హెల్దీగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలుగుతాం. అందుకే, పెద్దలు కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అని చెబుతుంటారు. అయితే, ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించాలనుకుంటే రోజూ కొన్ని ప్రత్యేకమైన నియమాలను పాటించాలంటున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు మాచిరాజు వేణుగోపాల్. వాటిని ఫాలో అవ్వడం ద్వారా మంచి ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యంసిద్ధిస్తుందంటున్నారు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రోజూ సూర్యోదయానికి ముందు, సాయం సంధ్యా వేళ ఈ నియమాలు పాటిస్తే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు పొందవచ్చంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు వేణుగోపాల్.

సూర్యోదయానికి ముందు చేయాల్సినవి!

సూర్యుడు ఉదయించడానికి ముందే నిద్రలేవాలి. ఆపై కాలకృత్యాలు పూర్తి చేసుకొని చల్లని నీరు లేదా గోరువెచ్చని నీటితో సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలి. అలాగే, విభూతిదారణ, డైలీ కనీసం కొద్దిసేపు అయినా దైవ ధ్యానాన్ని ఆచరించడం చేయాలంటున్నారు.

సాయం సంధ్యావేళ ఇలా చేయాలి!

  • సూర్యోదయానికి ముందు పైన చెప్పిన నియమాలతో పాటు సాయం సంధ్యా వేళ ఇంట్లోని లైట్లు అన్నీ వేసి ఉంచాలి. అంటే సంధ్యాలక్ష్మీకి స్వాగతం పలికే విధివిధానాన్ని పాటించాలి. ఇలా రోజూ కొన్ని ప్రత్యేకమైన విధివిధానాలు పాటించినట్లయితే ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా వస్తుందంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు వేణుగోపాల్.
  • ఎవరైతే నిత్యం ఇంట్లో "ఓం" ఛాంటింగ్ వినపడేటట్లు ఏర్పాట్లు చేసుకోవడం, దైవ సంకీర్తనతో శుభోదయాన్ని ప్రారంభించడం చేస్తారో వారికి అదృష్టం వరిస్తుందంటున్నారు.
  • ఇంటి ప్రాంగణంలో తులసి మొక్క నాటి రోజూ అక్కడ దీపారాధనచేయడం, అదేవిధంగా ఇంటి ఆవరణలో వివిధ రకాల పూల మొక్కలను పెంచి ఆ మొక్కలకు నిత్యం నీటిని సమర్పిస్తూ శివనామం, హరినామం జపించడం వంటి పనులు ఎవరైతే చేస్తారో వారు కర్మ విధ్వంసనం జరిగి దాని వల్ల కలిగే అద్వితీయమైన ప్రభావంతో మంచి జీవనాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుందంటున్నారు. అంతేకాకుండా ఈ పనులన్నింటినీ ఎవరైతే నిర్వహిస్తారో అలాంటి వ్యక్తులు అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారని సూచిస్తున్నారు మాచిరాజు వేణుగోపాల్.

ఆరోగ్యంగా ఉండాలంటే?

వ్యాధుల నుంచి బయటపడి ఆరోగ్యంగా ఉండడానికి సహాకరించే ఒక అద్భుతమైన పరిహారం ఉందని చెబుతున్నారు జ్యోతిష్యులు వేణుగోపాల్. అదేంటంటే ఎడమచేతిలో ఒక గ్లాసులో నీరు తీసుకొని దానిపై కుడి చేతిని ఉంచి "మామ్ భయాత్ సర్వతోరక్ష స్వీయం వర్దయా సర్వదా శరీరం ఆరోగ్యంమే దేహి దేవదీవన నమో స్తుతేః" అని ఏడుసార్లు అనుకొని ఆ నీటిని స్వీకరించాలి. ఇలా చేయడం ద్వారా సర్వ వ్యాధుల నుంచి బయపడటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందంటున్నారు. దాంతో చక్కటి జీవితాన్ని కొనసాగించవచ్చంటున్నారు.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు, జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఇవీ చదవండి :

"కస్తూరి కాయతో ఈ చిన్న పరిహారం చేస్తే - మీ సంపద పెరిగి దశ మారిపోతుంది!"

సాయంత్రం ఈ వస్తువులు కొంటున్నారా? - లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుందట!

ABOUT THE AUTHOR

...view details