తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

"మహిళలు సోమవారం ఇలా చేస్తే - మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది"!! - ASTROLOGY REMEDIES FOR MONEY

ధన లాభం కలగాలంటే ఆడవాళ్లు రాత్రి నిద్రించే ముందు కొన్ని పనులు చేయాలని సూచిస్తున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు 'మాచిరాజు కిరణ్​ కుమార్​'. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Astrology Remedies for Money
Astrology Remedies for Money (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2024, 7:33 PM IST

Astrology Remedies for Money : కొంతమంది ఎంత సంపాదించినా కూడా.. తమ వద్ద పైసా మిగలట్లేదని బాధపడుతుంటారు. ఎంత పొదుపు పాటించినా.. ఆర్థిక సమస్యలు తప్పడం లేదని ఆవేదన చెందుతుంటారు. అయితే ధనం ఎక్కువగా సంపాదించాలన్నా, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా.. రాత్రి నిద్రించే సమయంలో మహిళలు కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు 'మాచిరాజు కిరణ్​ కుమార్​' సూచిస్తున్నారు. ఈ పనులు చేస్తే ఆదాయం పెరిగి, ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలూ తలెత్తవని చెబుతున్నారు. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

ఆడవారు నిద్రపోయే ముందు చేయాల్సిన పనులివే:

  • ఇంట్లోని అన్ని గదులలో మహిళలు ప్రతిరోజూ కర్పూరం వెలిగించి నిద్రిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని మాచిరాజు కిరణ్ కుమార్​ చెబుతున్నారు. కర్పూరం నవగ్రహాల్లో శుక్రుడికి సంబంధించినది. పడుకునే ముందు కర్పూరం వెలిగిస్తే ఇంట్లో పాజిటివ్​ వైబ్రేషన్​ను కలిగించి శుక్రుడి బలాన్ని పెంచి లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుందని అంటున్నారు.
  • ఆడవారు ప్రతి రోజూ రాత్రి రెండు లవంగాలను కాల్చి నిద్రపోవాలని సూచిస్తున్నారు. లవంగాల నుంచి వచ్చే పొగ ఇంట్లోని నెగిటివ్​ ఎనర్జీని తొలగించి పాజిటివ్​ ఎనర్జీ వచ్చేలా చేస్తుందని.. తద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహం కలిగి ఇంట్లో ధనం నిలుస్తుందని చెబుతున్నారు.
  • ఆడవారు ప్రతిరోజూ రాత్రి నుదుటిన కుంకుమ బొట్టు ధరించి నిద్ర పోవాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని అంటున్నారు.
  • కుబేర స్థానమైన ఉత్తర దిక్కున.. రాత్రి పూట నిద్రపోయే ముందు ఆడవారు ఇంట్లో ఉత్తర దిక్కున కొన్ని నీళ్లు చిలకరించాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కుబేరుడి అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెబుతున్నారు.
  • నైరుతి దిక్కు ఇంటి యజమానికి సంబంధించి. కాబట్టి ఆడవారు రాత్రి నిద్ర పోయే సమయంలో నైరుతి దిక్కులో చీకటి లేకుండా చూసుకోవాలని చెబుతున్నారు. ఇంట్లో నైరుతి దిశలో చీకటి అనేది ఉండకూడదట. కాబట్టి ఆ దిక్కున లైట్​ ఉండేలా చూసుకోమంటున్నారు.
  • మహిళలు ప్రతీ శుక్రవారం నిద్రపోయేటప్పు గుమ్మం ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసి ఆ తర్వాత నిద్ర పోవాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం కలిగి ధనప్రాప్తి లభిస్తుందని అంటున్నారు. అదే విధంగా పౌర్ణమి రోజు రాత్రి ఇంటి ముందు అష్టదళం పద్మం ముగ్గు ఉండేలా చూసుకోమంటున్నారు. ఏ ఇంటి ముందైతే పౌర్ణమిరోజు రాత్రి ముగ్గు ఉంటుందో.. ఆఇంట్లోకి లక్ష్మీదేవి సులభంగా ప్రవేశిస్తుందని.. స్థిర నివాసం ఏర్పరచుకుంటుందని చెబుతున్నారు.
  • రాత్రి నిద్రించే సమయంలో వారానికి ఒకసారి ఆడవాళ్లు ఇంటి గుమ్మం ముందు ఆవ నూనెతో దీపం వెలిగించినా మంచి జరుగుతుందని అంటున్నారు. ఇలా చేస్తే నెగిటివ్​ ఎనర్జీ పోయి లక్ష్మీ దేవి ఆశీస్సులు లభిస్తాయని అంటున్నారు.
  • మహిళలు రాత్రి "ఓం శ్రీం నమః" అనే మంత్రాన్ని మూడు సార్లు చదివి నిద్రిపోవాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే శ్రీ మహాలక్ష్మీ సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందట.
  • మహిళలు నిద్రపోయే ముందు ప్రతి సోమవారం ఓ పరిహారం చేయాలని సూచిస్తున్నారు మాచిరాజు కిరణ్​ కుమార్​. అందుకోసం ఓ గాజు పాత్రలో కొద్దిగా రాళ్ల ఉప్పు పోసి పసుపు, కుంకుమ వేసి ఇంట్లో ఎవరికి కనిపించని చోట ఆ గాజు పాత్రను పెట్టాలి. మూడు రోజుల తర్వాత ఆ పాత్రలోని రాళ్ల ఉప్పును ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో పోయండి. ఈ పరిహారం చేయడం వల్ల ధనం పెరుగుతుందని.. శ్రీ మహాలక్ష్మీ ఆనంద తాండవం చేస్తుందని తెలుపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details