CHEVIREDDY MOHITH REDDY ARREST ? :తిరుపతి జిల్లాచంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో 37వ నిందితుడైన వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. బెంగళూరులో తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగింది :ఎన్నికల అనంతరం మే 14వ తేదీన శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్‌రూమ్‌ల పరిశీలన నిమిత్తం వచ్చిన పులివర్తి నానిపై హత్యాయత్నం చేశారు. పులివర్తి నానిపై వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనుచరులైనగణపతిరెడ్డి, భానుకుమార్‌రెడ్డి మరికొందరితో కలిసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ వద్ద ముందస్తు ప్రణాళికతో రాడ్లు, సుత్తి, బీరు సీసాలతో దాడికి తెగబడ్డారు.
స్వామి భక్తిని చాటుకున్న తిరుపతి పోలీసులు - నానిపై హత్యాయత్నం కేసులో బాధిత పార్టీ నేతలపై కేసులు - Fake Cases on TDP Leaders
పులిపర్తి నానిపై హత్యాయత్నం ఘటన సంచలనంగా మారిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో నాని ఫిర్యాదు మేరకు అప్పటికప్పుడు భానుకుమార్‌రెడ్డి, గణపతిరెడ్డితోపాటు మరికొందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మరుసటి రోజే 13 మందిని కోర్టులో హాజరుపరిచారు. తర్వాత కేసుకు సంబంధించిన 34 మందిని జైలుకు పంపారు.
ఈ కేసులో కుట్రదారులు ఎవరనే విషయం పోలీసు శాఖకు అప్పట్లో తెలిసినా కేసు నమోదుకు వెనుకంజ వేసినట్లు సమాచారం. బాధితులు వీడియో సాక్ష్యాలు అందజేసినా నిష్పక్షపాతంగా కేసు నమోదు చేయలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై ఎమ్మెల్యే పులివర్తి నాని న్యాయ పోరాటం సైతం చేశారు. సార్వత్రిక ఫలితాల అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు తారుమారు కావడంతో పోలీసులు కుట్రదారులపై దృష్టి పెట్టారు.
రిటర్నింగ్ అధికారి సహాయంతోనే వైఎస్సార్సీపీ నేతలు దాడి చేశారు: పులివర్తి నాని - Pulivarthi Nani Interview
ఇటీవల 37వ నిందితుడిగా చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పేరు చేర్చారు. ఈ కేసులో అరెస్టు తప్పదని భావించిన మోహిత్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును సైతం ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ స్వీకరించి విచారణ వాయిదా వేసిన నేపథ్యంలో మోహిత్‌రెడ్డి అరెస్టు తప్పకపోవచ్చని భావించిన ఆయన తండ్రి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ప్రత్యర్థి పులివర్తి నానిపై వ్యక్తిగత ఆరోపణలు సంధిస్తూ కవ్వింపు చర్యలకు దిగారు. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.
ఆధారాలన్నీ అందించాం- దాడి వెనకున్న మూల పురుషుడెవరో తేల్చాలి : నాని - SIT investigation Pulivarthi Nani