Interior Designer Pranay Nikhilesh: చిన్న రూం ఐనా, సింగిల్ బెడ్‌రూం ఐనా, షాపు ఐనా, షాపింగ్ మాల్ ఐనా ఆర్కిటెక్చర్‌కు మించి ఇంటీరియర్ డిజైన్‌కే ఎక్కువ మొత్తంలో ఖర్చవుతోంది. దీంతో యువత ఈ కోర్సుల వైపు అడుగేస్తున్నారు. చిన్నప్పటి నుంచే తండ్రితోపాటు సైట్లకు వెళ్లిన ఆ యువకుడు ఇంటీరియర్ డిజైనర్ కావాలనుకున్నాడు. ఫలితంగా జాతీయస్థాయిలో నిర్వహించిన ఆర్కిటెక్చర్ అండ్ డిజైనింగ్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అవార్డు సొంతం చేసుకున్నాడు. మరి, ఆ యంగ్ డిజైనర్ స్టోరీ చూసేద్దామా.
ప్రస్తుతం నిర్మాణం రంగంలో ఎక్కువగా వినిపిస్తున్నపేరు ఇంటీరియర్ డిజైన్. ఎందుకంటే, చాలామంది ఇంటీరియర్ డిజైన్ పైనే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. అయితే, విద్యార్థి దశలోనే ఈ విషయాన్ని గుర్తించాడీ యువకుడు. వినూత్నంగా ఆలోచిస్తూ డిజైన్స్ చేయడం మొదలు పెట్టాడు. విదేశాల్లో ఉద్యోగం సైతం వదులుకుని పూర్తిగా డిజైనింగ్ పైనే దృష్టి పెట్టాడు. అతడి పేరే ప్రణయ్ నిఖిలేష్. విజయవాడ స్వస్థలం.
లండన్‌లో మాస్టర్స్: ఇతడి తండ్రి మధుసూధనరావు నిర్మాణ రంగంలోనే ఉన్నారు. చిన్నప్పటి నుంచే తండ్రి వెంట తిరుగుతూ ఆర్కిటెక్చర్ ప్లానింగ్‌తో పాటు డిజైనింగ్ మెళకువలు నేర్చుకున్నాడు ప్రణయ్. నిర్మాణ రంగంలో రాణించాలనే లక్ష్యంతో బెంగళూరులో బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సు పూర్తి చేశాడు. బీ-ఆర్క్ కోర్సు పూర్తయిన తర్వాత ఓ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం చేశాడు. మాస్టర్ చేసేందుకు ఉద్యోగం వదిలి లండన్ వెళ్లాడు. మాస్టర్స్ అనంతరం మళ్లీ జాబ్‌లో చేరాడు. కానీ, అక్కడ తన ఆలోచనలకు ఆస్కారం లేదని గ్రహించాడు. సరైన గుర్తింపు రావాలంటే సొంత ఆలోచనలను ఆమలు పరిచే స్వేచ్ఛ ఉండాలని భావించి భారత్‌కు తిరిగి వచ్చేశాడు.
సంతృప్తినివ్వని ఉద్యోగం - లక్షల వేతనం వదిలేసి డ్రోన్ రంగంలోకి
దేవరకొండ ఫేస్‌బుక్‌లో నెయిల్ ఆర్ట్: అప్పటికే తండ్రి మధుసూధనరావు ఐక్యాచ్ పేరుతో కంపెనీ ప్రారంభించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదే వేదికగా తన ప్రతిభను చాటుకోవాలని నిర్ణయించుకున్నాడు ప్రణయ్. హీరో విజయ్ దేవరకొండ ఫేస్‌బుక్‌లో నెయిల్ ఆర్ట్‌తో అతడి ఫొటో పోస్ట్ చేశాడు. అది కాస్తా సోషల్ మీడియాలో బాగా వైరలైంది. అప్పటి నుంచి డిజైనర్‌గా రాణించగలననే నమ్మకం ప్రణయ్‌కి కలిగింది.
ఒక్కో డిజైన్ వినూత్నంగా రూపొందించడం మొదలు పెట్టాడు ప్రణయ్. ఆలా ఆర్కిటెక్చర్ డిజైనింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. జాతీయస్థాయిలో నిర్వహించిన ఫెస్టివల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైనింగ్ (FOAID) పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ద్వితీయ బహుమతి సొంతం చేసుకున్నట్లు చెబుతున్నాడీ డిజైనర్.
తక్కువ స్థలంలోనే ఆకట్టుకునే డిజైనింగ్‌పై దృష్టి సారించాడు. విజయవాడలో ఓ ఫర్నీచర్ షోరూం, జ్యువెల్లరీ షోరూంలో అద్భుతంగా ఇంటీరియర్ డిజైన్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. గడిచిన రెండేళ్లలో 35కుపైగా డిజైనింగ్ ప్రాజెక్టులు చేసినట్లు చెబుతున్నాడీ ఆర్కిటెక్చర్.
విజయవాడతోపాటు హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లోనూ గృహాలు, వాణిజ్య సముదాయాల్లో తనదైన మార్క్ ప్రదర్శించి కస్టమర్ల మన్ననలు పొందాడు. డిజైనింగ్‌పై ఆసక్తి, వినూత్నంగా ఆలోచించిస్తే ఈ రంగంలో ఎవరైనా రాణిస్తారని సూచిస్తున్నాడీ యువకుడు. ఇంటీరియర్ డిజైనింగ్‌కి సాంకేతికత జోడిస్తూ, అధిక మొత్తంలో డిజైనింగ్ ప్రాజెక్టులు చేస్తున్నాడు. టెక్నాలజీ, నూతన పోకడలకు అనుగుణంగా డిజైనింగ్ చేస్తూ, భవిష్యత్తలో ఐక్యాచ్‌ని ఉన్నతస్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని చెబుతున్నాడు.
"నా చిన్నప్పటి నుంచీ మా నాన్న ఇంటీరియల్ డిజైనింగ్ ఫీల్డ్‌లో ఉన్నారు. కాబట్టి ఆయనే నాకు స్ఫూర్తి. డిజైన్‌లో ఏదైనా గొప్పగా చేయాలని అనుకున్నాను. లండన్‌లో మాస్టర్స్ చేశాను. కొన్ని నెలల పాటు యూకే పని చేశాను. తరువాత విజయవాడ వచ్చేశాను". - ప్రణయ్, ఆర్కిటెక్చర్
"అమ్మ డైరీలో కొన్ని పేజీలు" - తొలి నవలతో ప్రశంసలు అందుకున్న టెకీ