Good days for Perupalem Beach: పశ్చిమ గోదావరి జిల్లాలోని సముద్ర తీరంలో పర్యాటక అభివృద్ధిపై ఆ ప్రాంత వాసుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. అహ్లాద పరిచే జలవనరులు, పచ్చని పరిసరాలు సహజ సౌందర్యాన్ని సంతరించుకున్న ఆ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు వరం. దీంతో ఏడాది పొడవునా ఇక్కడకు పర్యాటకులు వేలసంఖ్యలో తరలివస్తుంటారు. దాని ప్రాధాన్యత గుర్తించిన కూటమి ప్రభుత్వం పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
విస్మరించిన వైఎస్సార్సీపీ: నరసాపురం నియోజకవర్గంలో మాత్రమే సముద్ర తీరం విస్తరించి ఉంది. సుమారు 19 కిలోమీటర్ల మేర ఈ తీరం ఉంది. పేరుపాలెం సౌత్‌లోని మోళ్లపర్రు వద్ద ఉప్పుటేరు సముద్రంలో కలిసే ప్రాంతం నుంచి బియ్యపుతిప్ప సమీపంలో గోదావరి నది సాగర సంగమం వరకూ ఉన్న తీరం పర్యాటకానికి అనువుగా ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పర్యాటక శాఖామంత్రిగా బాధ్యతలు నిర్వహించిన రోజా పేరుపాలెం బీచ్‌ను సందర్శించారు. ఈ ప్రాంతాన్ని బ్లూప్రాగ్ బీచ్‌లుగా గుర్తింపు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కానీ వెంటనే ఆ హామీలను గాలికి వదిలేశారు.
సెయిల్ వద్దంటోంది - కారణం అదే! విశాఖ స్టీల్‌పై కేంద్రమంత్రి క్లారిటీ
ప్రతిపాదనలకు స్పందించిన ప్రభుత్వం: అధికార యంత్రాంగం సముద్రతీరం పొడవునా 5 ప్రాంతాల్లో బీచ్‌లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. 3 చోట్లకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని సముద్రతీరంలో రిసార్టుల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పర్యాటకులు సేద తీరేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు. 2027లో గోదావరి పుష్కరాలు సందర్భంగా గోదావరి తీరంలో పర్యాటక అభివృద్ధికి చేపట్టాల్సిన నిర్మాణాలు, ఏర్పాట్లపై ప్రణాళిక సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. ఇటీవల ఎమ్మెల్యే దీనిపై అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు.
పర్యాటక అభివృద్ధికి కార్యాచరణ: పర్యాటక అభివృద్ధితో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకు అవకాశం ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. నియోజకవర్గంలోని సముద్ర, గోదావరి తీరంలో పర్యాటక అభివృద్ధికి కార్యాచరణ రూపొందించామని దీనిపై ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌కు ప్రతిపాదనలు అందించామని తొందరలోనే ఆ దిశగా చర్యలు చేపడతామని బొమ్మిడి నాయకర్ తెలిపారు.
కన్నీరు పెడుతున్న కృష్ణమ్మ - స్నానాలు చేసేందుకు జంకుతున్న జనం
బొమ్మలకు ప్రాణం పోస్తున్న మహిళలు - ప్రసిద్ధ ఉదయగిరి బొమ్మల గురించి మీకు తెలుసా?