SAND ILLEGAL TRANSPORTATION: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం గోపాలపురం గ్రామ సమీపంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ప్రతి రోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, లారీలతో ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నారు. ఎటువంటి అధికారిక అనుమతులు లేకపోయినప్పటికీ అక్రమంగా రవాణా చేస్తున్నారు.
పాలకొండ సమీపంలోని ఏజెన్సీతో పాటు సమీపంలోని పట్టణాలకు ఇసుక తరిలిపోతుంది. ట్రాక్టర్కు వెయ్యి రూపాయలు, లారీలకు 5,000 నుంచి 7,000 వరకు వసూలు చేస్తున్నారు. అక్రమ రవాణాకు అనువుగా నదిలో అడ్డంగా రహదారి నిర్మించారు. యంత్రాల సాయంతో నిరంతరాయంగా ఇసుకను తరలిస్తూనే ఉన్నారు. ఇసుక అక్రమ రవాణాతో పక్కనే ఉన్న గోపాలపురం గ్రామానికి ముప్పు పొంచి ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అప్పుడప్పుడు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ ఆ సమయంలో రవాణా నిలిపివేసి తిరిగి కొనసాగిస్తున్నారు. గ్రామంలోని రెండు మార్గాల ద్వారా ఇదంతా సాగుతోంది.
పగటిపూట పొదల్లో - రాత్రికాగానే రేవుల్లో!
అనధికార రీచ్‌ల్లోకి వరుసకడుతున్న ట్రాక్టర్లు- అప్పుడూ ఇప్పుడూ అదే దందా!