ETV Bharat / politics

దావోస్‌ ఒప్పందాలపై దుష్ప్రచారం - ఏపీని మళ్లీ ప్రపంచపటంలో పెట్టడమే లక్ష్యం: చంద్రబాబు - CM CHANDRABABU PRESS MEET

దావోస్‌ పర్యటన ముగిసిన నేపథ్యంలో సచివాలయంలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం

CM Chandrababu
CM Chandrababu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 25, 2025, 3:34 PM IST

CM Chandrababu Press Meet on Davos Tour: దావోస్​కు వెళ్లి వచ్చాక అక్కడి అంశాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దావోస్‌ పర్యటన ముగించుకుని వచ్చిన నేపథ్యంలో సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. 1995 నుంచి దావోస్​కు వెళ్లడం ప్రారంభించానని, మొదట్లో ఏ హైదరాబాద్ అని అడిగారన్నారు. సీఎంలుగా తన తరువాత కర్ణాటక నుంచి ఎస్​ఎం కృష్ణ వచ్చారని గుర్తు చేశారు. బిల్ గేట్స్ కూడా ఏపీ కోసం ప్రమోట్ చేస్తున్నారా అని అడిగారని వెల్లడించారు. ధ్వంసం అయిన ఏపీ బ్రాండ్​ను మళ్లీ ప్రమోట్ చేస్తున్నా అని చెప్పానని పేర్కొన్నారు. దావొస్​లో మొత్తం 27 సమావేశాల్లో పాల్గొన్నానని తెలిపారు. కంట్రీ స్ట్రాటజిక్ డయలాగ్ అనే అంశంపై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నామని వివరించారు.

అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ: హ్యూమన్ మిషన్ కొలాబరేషన్ అన్ లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్, గ్రీన్ ఎనర్జీ - గ్రీన్ హైడ్రోజన్ మాన్యుఫాక్చరింగ్ అనే అంశంపై సదస్సులో పాల్గొన్నానని తెలిపారు. ఏపీని పెట్రో కెమికల్ హబ్, బ్లూ ఓషన్ ఎకానమీ అనే అంశాల గురించి విస్తృతంగా చర్చ చేశామని తెలిపారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన, ప్రకృతి వ్యవసాయంపై చర్చ చేశామన్నారు. లోకేశ్ 35 సమావేశాలు, 5 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరు అయ్యారని తెలిపారు. మొత్తం మీద ఏపీని మళ్లీ ప్రపంచ పటంపైన పెట్టడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు. 1995లో ఐటీ రంగం, ఇప్పుడు 2025లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కీలక రంగాలుగా మారాయని వెల్లడించారు. గతంలో నైపుణ్యం కోసం ఐటీతో పాటు ఇంగ్లీష్ కూడా నేర్పించామని గుర్తు చేశారు.

విజయవంతంగా ముగిసిన దావోస్ పర్యటన - సీఎం చంద్రబాబు సంతృప్తి

ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉండాలి: మన వాళ్లు ఉద్యోగాలు పొందటం కాదని, ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు మన వాళ్లు 25 శాతం మేర యూరప్​లో ఉన్నారని అన్నారు. అమెరికాలో తెలుగు 12వ స్థానంలో ఉందని, ఈ మార్పు కేవలం 25 ఏళ్లలో సాధ్యం అయ్యిందని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాల్లో తెలుగువాళ్లు ఉన్నారన్న సీఎం, అప్పుడు చేసిన విజన్ కారణం గానే ఇది సాధ్యమైందని తెలిపారు. భారత పరిశ్రమల సమాఖ్యతో కలిసి గ్లోబల్ లీడర్​షిప్ సెంటర్​లను ఏర్పాటు చేస్తున్నామన్న చంద్రబాబు, పరిశ్రమల సహకారం కూడా తీసుకుంటామని వ్యాఖ్యానించారు. 2047 నాటికి అత్యంత ప్రభావితమైన వ్యక్తులుగా తెలుగు వారు ఉంటారని తెలిపారు.

ఒప్పందాలపై దుష్ప్రచారం చేస్తున్నారు: అమరావతితో పాటు ఇతర ప్రాంతాలు దేశాల్లో కూడా గ్లోబల్ లీడర్​షిప్ సెంటర్​లు ఏర్పాటుకు ప్రయత్నిస్తామన్నారు. వచ్చే కాలానికి ప్రపంచానికి అన్ని సేవలు ఇవ్వగలిగే స్థాయికి ఏపీ వస్తుందని ఊహిస్తున్నానని అన్నారు. దావోస్ వెళ్లి ఎన్ని డబ్బులు తెచ్చారు, ఎన్ని ఒప్పందాలు చేసుకున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దావోస్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ కంపెనీలు, వివిధ దేశాల ప్రతినిధులు వచ్చే ఓ సమావేశ కేంద్రం అని తెలిపారు. మూడు రోజుల్లో అందరినీ ఒకే చోట కలిసే అవకాశం ఉందన్నారు.

పోర్టులను సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నాం: ప్రపంచంలో వచ్చే ఆధునిక ఆలోచనలు, ట్రెండ్స్ తెలుసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. మొత్తంగా నెట్​ వర్కింగ్ చేసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఈసారి గ్రీన్ ఎనర్జీ - గ్రీన్ హైడ్రోజన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది కీలకమైన అంశాలుగా మారాయని పేర్కొన్నారు. ఏపీలో 10 పోర్టులు ఉన్నాయన్న ముఖ్యమంత్రి, వాటిని ఇప్పటి వరకూ మనం సక్రమంగా వినియోగించుకోలేక పోతున్నామన్నారు. మన వద్ద ఉన్న వనరులు, ఉత్పత్తి సరిగ్గా ఇతర ప్రాంతాలకు దేశాలకు ఎగుమతి చేయలేక పోతున్నామని తెలిపారు. కానీ కొన్ని చిన్న దేశాలు కూడా చక్కగా వాటిని వర్గీకరించి పోర్టుల ద్వారా ఎగుమతి చేస్తున్నాయని గుర్తు చేశారు.

వారసత్వం ఓ మిథ్య - అవకాశాలు అందుకుంటేనే భవిత : సీఎం చంద్రబాబు

భారత్​కు స్వర్ణయుగం రాబోతోంది: ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ గ్రీన్ ఎనర్జీని ప్రమోట్ చేస్తోందని, అమరావతితో పాటు రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి ఉన్న అవకాశాలు వివరించామన్నారు. సమీప కాలంలోనే భారత్​కు ప్రపంచ వ్యాప్తంగా స్వర్ణయుగం రాబోతోందని వెల్లడించారు. యువ భారత్ అనేది మనకు ఉన్న అద్భుతమైన అవకాశమని పేర్కొన్నారు. జీడీపీ వృద్ధి రేటులో కూడా సుదీర్ఘ కాలం భారత్ అగ్రస్థానంలో ఉండబోతోందని వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆమోదయోగ్యమైన వ్యక్తులు ఇండియన్స్ అని తెలిపారు. రామాయపట్నంలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ బీపీసీఎల్ ఏర్పాటు చేయబోతోందని, దీని ద్వారా 96 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు.

విశాఖలో ఐటీ ఒక గేమ్ ఛేంజర్‌: అనకాపల్లి దగ్గర 1.35 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్ వస్తోందనన్నారు. 1.87 లక్షల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయబోతోందని తెలిపారు. గ్రీన్ అమ్మోనియా కూడా కాకినాడ నుంచి ఎగుమతి చేయబోతున్నాఅని పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి వస్తున్నపెట్టుబడులు 10 లక్షల కోట్ల రూపాయలని తెలిపారు. అలాగే ఐటీ సేవల రంగంలోనూ విశాఖలో గూగుల్ ఒక గేమ్ ఛేంజర్​గా మారబోతోందని వెల్లడించారు. టీసీఎస్ కూడా విశాఖలో యూనిట్ ఏర్పాటు చేస్తోందన్నారు. రాష్ట్రంలో భవిష్యత్ అంతా పర్యాటకానిదేనన్నసీఎం, టాటా గ్రూప్ 200 వరకూ గదులు నిర్మించేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు.

గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసాన్ని మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. అమరావతిలో పనులు ప్రారంభం కానున్నాయని విద్య, వైద్యం, ఇన్​ఫ్రా రంగాల్లో కీలకంగా మారుతుందని స్పష్టం చేశారు. పోలవరంలో కూడా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పనులు ఊపందుకున్నాయన్నారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పనులు పూర్తి చేసి నీళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం 11,457 కోట్లతో రివైవ్ ప్యాకేజ్ ఇచ్చిందని గుర్తు చేశారు. విద్వంసం చేసిన వ్యక్తులు ఇంకా గొంతు చించుకుటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమర్​రాజా లాంటి సంస్థలను ఏపీ నుంచి తరిమేశారన్నారు. సాధారణ పౌరుడుకి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడం, తలసరి ఆదాయం పెంచడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

ప్రపంచానికే మన దేశం టెక్నాలజీని అందజేస్తోంది : సీఎం చంద్రబాబు

Chandrababu On Growth Rate: 2047 నాటికి 15 శాతం వృద్ధి రేటుతో 58 లక్షల తలసరి ఆదాయం నమోదు చేయించడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. సాంకేతికత పెంచడం, వ్యవసాయం, సేవల రంగం, టూరిజం, ఆక్వా ఇలా అన్ని రంగాల్లో ఏపీ అభివృద్ధి చెందేలా చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తమ లక్ష్యాల సాధనలో భాగస్వామి కావాలని బిల్ గేట్స్​ను కోరానన్నారు. బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా సహకారం అందించాలని కోరినట్లు తెలిపారు. డీప్ టెక్ , అగ్రి టెక్ లాంటి సాంకేతికతను లక్ష్యాల సాధనకు వినియోగించుకుంటామని అన్నారు.

దేశంలో సంస్కరణలు వచ్చి 30 ఏళ్లు అయ్యింది కానీ ఇంకా చాలా వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. అందుకే పీ4 విధానం తెచ్చామని పేర్కొన్నారు. పాపులేషన్ మేనేజ్​మెంట్ చేయాల్సి ఉంటుందని దావోస్​లో చెప్పానన్నారు. తొలినాళ్లలో పీసీ అంటే పోలీస్ కానిస్టేబులు అని ఎగతాళి చేశారన్నారు. ఇతర రాష్ట్రాలతో పెట్టుబడుల కోసం పోటీ పడినా, కోపరేటివ్ ఫెడరల్ స్పిరిట్​తోనే ముందుకు వెళ్లాలని అన్నారు. పెట్టుబడుల కోసం రాష్ట్రంలో ఎకోసిస్టం రూపకల్పన చేస్తున్నామని వెల్లడించారు. ఏపీకి ఉన్న పోర్టులు మన బలం అని, త్వరలో అంతా వారి వారి ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి చేయాలంటే పొరుగు రాష్ట్రాలు మనపైనే ఆధారపడాల్సి ఉంటుందన్నారు.

Chandrababu On Hyderabad: హైదరాబాద్ ఒక్క తెలంగాణది మాత్రమే కాదని, తెలుగు ప్రజలదని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. దాని అభివృద్ధిని చూసి తాను గర్వపడతానన్నారు. సృష్టించిన సంపదను ఎవరూ ధ్వంసం చేయాలని అనుకోరని, కొందరు వికృతంగా ఆలోచించి అలాంటి పనులు చేస్తారని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందితే అది దేశాభివృద్ధికే చెందుతుందని వెల్లడించారు. షిప్ బిల్డింగ్ కోసం ఏపీలో చాలా అవకాశాలు ఉన్నాయని, కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తే చాలా పరిశ్రమలు ఏపీకి వస్తాయని స్పష్టం చేశారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం జిందాల్​తో చర్చించానన్నారు. విజయ సాయి రెడ్డి రాజీనామా వారి అంతర్గత వ్యవహారమని తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకత్వం పై విశ్వాసం లేక పోతే పార్టీని కొందరు వీడి వెళ్లిపోతారని పేర్కొన్నారు.

ఏపీలో పెట్టుబడులు పెట్టండి - గ్లోబల్‌ కార్పొరేట్‌ కంపెనీలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.