తెలంగాణ

telangana

ETV Bharat / politics

ఓటమి భరించలేక దాడులు చేస్తున్న వైఎస్సార్సీపీ రౌడీ మూకలు - భయాందోళనలో కూటమి శ్రేణులు - YSRCP Followers Attack on TDP Leaders

YSRCP Gangs Attacks on Alliance Activists : ఏపీలోని ఎన్నికల్లో ఓటమిని భరించలేక తిరుపతి జిల్లా చిల్లకూరులో కొందరు వైఎస్సార్సీపీ రౌడీ మూకలు టీడీపీ నేతలపై దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేత వర్గీయులు మారణాయుధాలతో దాడి చేయడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు జిల్లా తెనాలిలో టీడీపీ, జనసేన కార్యకర్తలపై వైఎస్సార్సీపీ వార్డు కౌన్సిలర్, అతడి అనుచరులు దాడి చేశారు.

YSRCP Followers Attack on TDP Leaders
YSRCP Gangs Attacks on Alliance Activists (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 7, 2024, 4:26 PM IST

ఓటమి భరించలేక దాడులు చేస్తున్న వైఎస్సార్సీపీ రౌడీ మూకలు భయాందోళనలో కూటమి శ్రేణులు (ETV Bharat)

YSRCP Gangs Attacks on Alliance Activists: ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరులో వైఎస్సార్సీపీ రౌడీ మూకలు, తెలుగుదేశం నేతలపై దాడికి పాల్పడ్డాయి. ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు బాణాసంచా కాల్చారు. దీంతో వైఎస్సార్సీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, ఆయన వర్గీయులు మారణ ఆయుధాలతో దాడి చేశారు. నాయుడుపేట టీడీపీకి చెందిన యువకులు అక్కడికి చేరుకుని దాడిలో తీవ్రంగా గాయపడిన విజయులు రెడ్డి, రాకేశ్​ రెడ్డిని ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కనుసన్నల్లోనే దాడి జరిగిందన్న విమర్శలు రావడంతో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, నిందితుడు సత్యనారాయణరెడ్డి అతని వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు.

YSRCP Followers Attack on TDP Leaders : వైఎస్సార్సీపీ ఓడిపోయిందనే కక్షతో టీడీపీ, జనసేన కార్యకర్తలపై దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. మారీస్ పేట 22వ వార్డు కౌన్సిలర్ దుబాయ్ బాబు, అతని అనుచరులు అదే వార్డుకు చెందిన టీడీపీ, జనసేన కార్యకర్తలపై దాడి చేశారు. వైఎస్సార్సీపీకి మెజార్టీ రావాల్సిన వార్డులో కూటమికి మెజార్టీ రావటంతో దాడి చేసినట్లు కార్యకర్తలు ఆరోపించారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ 3టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. వైఎస్సార్సీపీ పాలనలో తమపై దాడులు జరిగినా పోలీసులు పట్టించుకోలేదని తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాడులు ఆపలేకపోతున్నారని మండిపడ్డారు.

విధ్వంసం- విద్వేషం! ఇవే వైఎస్సార్సీపీ ఓటమికి ప్రధాన కారణాలు - Reasons For YSRCP Defeat In AP

ABOUT THE AUTHOR

...view details