తెలంగాణ

telangana

ETV Bharat / politics

పొన్నవోలుకు హడావుడిగా ఏఏజీ పదవి ఎందుకు ఇచ్చారు?: వైఎస్‌ షర్మిల - sharmila comments on cm jagan - SHARMILA COMMENTS ON CM JAGAN

YS Sharmila Comments on CM Jagan : అక్రమాస్తుల కేసులలో రిజిస్టర్ చేసిన ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్సార్ పేరును, సీబీఐ చేర్చలేదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. జగన్‌ ఆదేశాల మేరకే, పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వైఎస్‌ పేరును ఛార్జిషీట్‌లో చేర్చే ప్రయత్నం చేశారని ఆమె స్పష్టం చేశారు.

YS Rajasekhara Reddy Name In Charge Sheet
YS Sharmila Comments on CM Jagan

By ETV Bharat Telangana Team

Published : Apr 28, 2024, 4:27 PM IST

పొన్నవోలుకు హడావుడిగా ఏఏజీ పదవి ఎందుకు ఇచ్చారు?: వైఎస్‌ షర్మిల

YS Rajasekhara Reddy Name In Charge Sheet : అక్రమాస్తుల కేసులలో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో, వైఎస్సార్ పేరును సీబీఐ చేర్చలేదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. జగన్‌ ఆదేశాల మేరకే, ఛార్జిషీట్‌లో వైఎస్‌ పేరును పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చేర్చే ప్రయత్నం చేశారని ఆమె స్పష్టం చేశారు. జగన్‌ ఆదేశానుసారం, మూడు కోర్టుల్లో పొన్నవోలు పిటిషన్లు వేశారని తెలిపారు. అందుకే జగన్‌ సీఎం పదవి చేపట్టిన వెంటనే, హడావుడిగా పొన్నవోలుకు పదవి కట్టబెట్టారని ఆరోపించారు. ఏ సంబంధం లేకపోతే హడావుడిగా ఏఏజీ పదవిని ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.

99 శాతం హామీలు ఎలా పూర్తయ్యాయి జగన్? - ఈ ప్రశ్నలకు సమాధానం ఏంటి? - YSRCP MANIFESTO 2024

స్వామిభక్తిని ఆయన చాటుకున్నారు :ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల స్పందించారు. స్వామిభక్తిని ఆయన చాటుకున్నారని ఆమె ఎద్దేవా చేశారు. పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదని దుయ్యబట్టారు. మహిళ అనే సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్‌ అధ్యక్షురాలినైన తనను ఏకవచనంతో సంబోధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్సార్సీపీని ఎందుకు నమ్మాలి :వైఎస్సార్సీపీ పాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని, ఇప్పుడు కొత్త దాన్ని ప్రజలు ఎలా నమ్ముతారని వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలో మద్యనిషేధం చేయకపోగా ప్రభుత్వమే విక్రయిస్తోందని ఆమె దుయ్యబట్టారు. మెగా డీఎస్సీకి బదులు దగా డీఎస్సీ ఇచ్చారని ఆక్షేపించారు. ఏటా సంక్రాంతికి ఇస్తామన్న జాబ్‌ క్యాలెండర్‌ ఏమైందని, ఐదు సంక్రాంతులు వెళ్లాయని, ఒక్క జాబ్‌ క్యాలెండర్ అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. యువతకు ఉద్యోగావకాశాలు ఎందుకు కల్పించడంలేదని, ప్రభుత్వశాఖల్లోని ఖాళీలను ఇంతవరకు ఎందుకు భర్తీ చేయలేకపోయారని నిలదీశారు.

చెల్లి చీరపై అన్న​ సెటైర్లు - ​సంస్కారం ఉందా అంటూ జగన్​పై షర్మిల ఫైర్ - SHAMRILA COUNTER TO JAGAN COMMENTS

వైఎస్సార్సీపీ కార్యకర్తలకు మాత్రం వాలంటీర్‌ పోస్టులు ఇచ్చారని షర్మిల గుర్తు చేశారు వాటిని ప్రభుత్వ ఉద్యోగాలుగా చెబుతారా? ఎన్నికల ముందు హడావుడిగా డీఎస్సీ ఇస్తారా? అని ప్రశ్నించారు. జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టులను పూర్తిచేస్తామని గత మేనిఫెస్టోలో వైసీపీ హామీ ఇచ్చిందని, ఇంతవరకు ఒక్క ప్రాజెక్టును కూడా ఎందుకు పూర్తి చేయలేకపోయారని నిలదీశారు. రైతులకు ధరల స్థిరీకరణ నిధి పేరిట రూ.3వేల కోట్లు కేటాయిస్తామన్నారని, ఒక్క ఏడాదైనా రూపాయి కేటాయించారా? అని ప్రశ్నించారు. హామీలను తమరే నిలబెట్టుకోలేనపుడు ప్రజలు ఎలా నమ్ముతారని, పాత మేనిఫెస్టోలోని హామీలనే నెరవేర్చనపుడు కొత్తదానికి విలువేముంటుందని నిలదీశారు.

"రోడ్లు గిట్లుంటే ఓట్లెట్ల పడ్తయ్ సామీ" - ఏపీ రహదారుల దుస్థితిపై మంత్రి తుమ్మల రియాక్షన్ - TS MINISTER ON AP DAMAGED ROADS

ABOUT THE AUTHOR

...view details