ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

జగన్​ను ఆస్కార్​కు నామినేట్ చేసిన షర్మిల - బైబిల్‌పై ప్రమాణం చేయాలని సవాల్ - SHARMILA ON JAGAN IN ADANI ISSUE

సెకి పవర్ డీల్‌ను విషయంలో తనకు సన్మానం చేయాలన్న జగన్ - ముందు కొన్ని ప్రశ్నలకు జవాబివ్వాలి: షర్మిల

YS Sharmila on YS Jagan Defends SECI Power Deal in AP
YS Sharmila on YS Jagan Defends SECI Power Deal in AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2024, 2:29 PM IST

  • అబద్ధాలను అందంగా అల్లినందుకు జగన్‌కు ఆస్కార్ ఇవ్వాలి: షర్మిల
  • సన్మానాలు కోరుకొనే ముందు జగన్ కొన్ని ప్రశ్నలకు జవాబివ్వాలి: షర్మిల
  • యూనిట్ ధర రూ.2.14 ఉంటే.. జగన్‌ రూ.2.49కు కొన్నారు: షర్మిల
  • ఎక్కువ ధర చెల్లించి కొన్నందుకు జగన్‌ను సన్మానించాలా?: షర్మిల
  • అదానీ వద్ద గుజరాత్ రూ.1.99 పైసలకే విద్యుత్‌ కొన్నది: షర్మిల
  • మీరు యూనిట్‌కు 50 పైసలు ఎక్కువ పెట్టి కొన్నారు: షర్మిల
  • అదానీతో ఒప్పందానికి మిగిలిన రాష్ట్రాలు ముందుకు రాలేదు: షర్మిల
  • ఆగమేఘాలపై ఒప్పందం చేసుకున్న జగన్‌ను సన్మానించాలా?: షర్మిల
  • సీఎంను వ్యాపారవేత్తలు గోప్యంగా కలవడం ఎక్కడైనా ఉందా?: షర్మిల
  • దమ్ముంటే జగన్ సమాధానం చెప్పాలి: వైఎస్‌ షర్మిల
  • అదానీతో మీ ఒప్పందం రాష్ట్రంలోనే కాదు.. అంతర్జాతీయంగా చరిత్రే: షర్మిల
  • రూ.1,750 కోట్లు నేరుగా సీఎంకు ముడుపులు ఇవ్వడం చరిత్రే: షర్మిల
  • ఎవరూ కొనని విద్యుత్‌ను బంపర్ ఆఫర్‌గా ప్రకటించుకోవడం చరిత్రే: షర్మిల
  • గంటల్లోనే క్యాబినెట్ సమావేశం పెట్టడం చరిత్రే: షర్మిల
  • ప్రజాభిప్రాయం లేకుండా ఒప్పందాలకు ఆమోదం చరిత్రే: షర్మిల
  • అదానీ కోసం అన్ని టెండర్లు రద్దుచేయడం కూడా చరిత్రే: షర్మిల
  • ఒక వ్యక్తి స్వార్థం కోసం రాష్ట్ర ప్రజలపై భారం మోపుతారా?: షర్మిల
  • ప్రజల నెత్తిన రూ.1.67 లక్షల కోట్ల భారాన్ని మోపడం చరిత్రే: షర్మిల
  • ప్రపంచమంతా మీ అవినీతి గురించి మాట్లాడుకోవడం చరిత్రే: షర్మిల
  • ప్రపంచ అవినీతిపరుల జాబితాలో మీపేరు చేరడం పెద్ద చరిత్రే: షర్మిల
  • అమెరికా కేసులో నా పేరు ఎక్కడుందని జగన్‌ బుకాయిస్తున్నారు: షర్మిల
  • ఏపీ సీఎం అంటే ఆనాడు జగన్‌మోహన్‌రెడ్డి కాదా?: షర్మిల
  • సీఎం కుర్చీలో మీరు కాక.. మిమ్నల్ని నడిపించే వాళ్లు కూర్చున్నారా?: షర్మిల
  • ఇదేం అహంకారపు తిరస్కరణ సమాధానం?: వైఎస్‌ షర్మిల
  • జగన్‌ అవినీతి చేశారని అమెరికా దర్యాప్తు సంస్థలే చెప్పాయి: షర్మిల
  • జగన్‌ అవినీతిపై ఎఫ్‌బీఐ, ఎస్‌ఈసీ నివేదికలు ఇచ్చాయి: షర్మిల
  • గత టీడీపీ ప్రభుత్వం ఎక్కువ ధరకు పీపీఎల్‌ చేసుకుందని జగన్‌ అన్నారు: షర్మిల
  • జగన్‌ అధికారంలోకి వచ్చాక గాడిదలు కాశారా?: షర్మిల
  • అదానీకి 25 ఏళ్లు రాష్ట్రాన్ని జగన్‌ తాకట్టు పెట్టారు: వైఎస్‌ షర్మిల
  • రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినందుకు జగన్‌కు ఎంత ముట్టిందో అర్ధమవుతోంది: షర్మిల
  • గంగవరం పోర్టును రూ.640 కోట్లకే జగన్‌ అమ్మేశారు: షర్మిల
  • గంగవరం పోర్టును అమ్మినప్పుడే ముడుపుల బంధం తెలిసిపోయింది: షర్మిల
  • రాష్టాన్ని బ్లాంక్ చెక్కులా అదానీకి జగన్‌ కట్టబెట్టారు: షర్మిల
  • అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదని జగన్‌ బైబిల్‌పై ప్రమాణం చేస్తారా?: షర్మిల
  • దమ్ముంటే ఈ సవాల్‌ను జగన్ స్వీకరించాలి: వైఎస్‌ షర్మిల

సెకితో ఒప్పందం - అవినీతికి రోల్‌మోడల్‌ కాదా జగన్?

ABOUT THE AUTHOR

...view details