Bandi Sanjay Paid Homage to Ramoji Rao:కరీంనగర్ ఈనాడు యూనిట్ కార్యాలయంలో రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రామోజీరావుతో తనకు ఉన్న అనుభందాన్ని గుర్తు చేసుకున్నారు. రామోజీరావు క్రమశిక్షణకు మారుపేరని కొనియాడారు.
ఈనాడు ఉద్యోగులంటే సమాజంలో గౌరవం ఏర్పడటానికి ప్రధాన కారణం రామోజీరావు అనుసరించిన పద్దతులేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. రామోజీరావు భౌతికంగా లేకపోయినా ఈనాడు రూపంలో నిత్యం మన మధ్యే ఉంటారని పేర్కొన్నారు. రామోజీతో తనది గురుశిష్యుల బంధమన్న బండి సంజయ్ ఆయన్ను కలిసిన ప్రతిసారి ఎన్నో విషయాలు నేర్చుకొనే వాడినని గుర్తు చేసుకున్నారు.
అక్షరయోధుడు రామోజీరావుకు ఉద్యోగుల నివాళి
Bandi Sanjay About Ramoji Rao : క్రమశిక్షణకు మారుపేరైన రామోజీరావు మన మధ్య లేకపోవడం బాధాకరమని బండి సంజయ్ విచారం వ్యక్తం చేశారు. అయినా రామోజీ గ్రూపు సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి అహర్నిషలు కృషి చేస్తారన్న నమ్మకం తనకే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల వారికి ఉందని తెలిపారు. ఈనాడు సంస్థలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంతకుముందు ఈ కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్‌కుమార్ యునిట్ ఇన్‌చార్జి యుగంధర్ రెడ్డి స్వాగతం పలికారు.
మనందరి మార్గదర్శి, కుటుంబ పెద్ద లాంటి గొప్ప వ్యక్తిని కోల్పోయామని బండి పేర్కొన్నారు. తనలాంటి వ్యక్తులు ఆయన దగ్గరికి వెళ్తే విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారని తెలిపారు. అనేక విషయాలపై చర్చించేందుకు రామోజీరావును కలిసినట్లు చెప్పారు. ఈనాడు పేపర్, ఈటీవీ రిపోర్టర్స్‌కు సమాజంలో గౌరవం ఉందంటే ఆయన నిక్కచ్చితనమే కారణమని వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఆయన స్పూర్తితో ముందుకు సాగాలని కోరారు. రామోజీరావుకు మరింత పేరు వచ్చేలా ఈనాడు ఉద్యోగులు పని చేయాలని బండి సంజయ్ సూచించారు.
రామోజీకి ఫేమస్ షెఫ్ నివాళులు- అప్పుడు ETVతోనే కెరీర్ స్టార్ట్ చేసి, గిన్నిస్ రికార్డ్ సృష్టి - Tributes To Ramoji Rao