Union Home Minister Amit Shah key comments:మెున్న చంద్రబాబు, నిన్న సీఎం జగన్ దిల్లీ పర్యటన నేపథ్యంలో, ఎన్డీఏతో పొత్తుపై రాష్ట్రంలో విసృతంగా చర్చలు జరుగుతున్నాయి. ఇరువురు నేతలకు బీజేపీ పెద్దలు ఎలాంటి హామీలు ఇచ్చారు అన్న అంశంపై ఉత్కంఠ మెుదలైంది. బీజేపీతో చంద్రబాబు కలుస్తారంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తుండగా, వైఎస్సార్సీపీయే బీజేపీతో అంటకాగుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత అమిత్ షా పొత్తుల అంశంపై స్పందించారు. ఏపీలో పొత్తులపై త్వరలోనే నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు.
ఏపీలో పొత్తులపై త్వరలోనే నిర్ణయాలు: ఎన్నికల వేళ కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా (Union Home Minister Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై అమిత్ షా స్పందించారు. ఎకనమిక్ టైమ్స్ సమ్మిట్‌లో మాట్లాడిన ఆయన, ఏపీలో పొత్తులపై త్వరలోనే నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు. ఎన్డీఏ (NDA) లోకి కొత్త మిత్రులు వస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. ఫ్యామిలీ ప్లానింగ్ కుటుంబపరంగా బాగుంటుందన్న అమిత్ షా రాజకీయకూటమి ఎంత పెద్దగా ఉంటే అంత మంచిదని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి కొందరు కూటమి నుంచి బయటకు వెళ్లి ఉండొచ్చని అమిత్ షా అన్నారు.
ప్రధాని మోదీ చంద్రయాన్-3 విజయవంతం - కాంగ్రెస్ రాహుల్‌యాన్ విఫలం : అమిత్‌షా