ETV Bharat / state

పెన్నా నదిలో చిక్కుకున్న ఆరుగురు పశువుల కాపరులు - ఎలా రక్షించారంటే

పెన్నా ఉద్ధృతిలో చిక్కుకున్న ఆరుగురు పశువుల కాపరులు - బోట్ల సహాయంతో ఆరుగురిని ఒడ్డుకు తీసుకువచ్చిన అధికారులు

Six_people_trapped_in_Penna_River
Six people trapped in Penna River (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

SIX PEOPLE TRAPPED IN PENNA RIVER: పశువులను మేతకు తీసుకెళ్లిన ఆరుగురు కాపరులు నదిలో చిక్కుకున్నారు. ఒక్కసారిగా నదీ ప్రవాహం పెరగడంతో ఎటూ వెళ్లలేక పోయారు. దీంతో బిక్కుబిక్కుమంటూ ఉన్న వారిని అతికష్టం మీద కాపాడారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నెల్లూరు జిల్లా కోవూరు మండలం జమ్మిపాలెం వద్ద పెన్నా నది వరద ప్రవాహంలో చిక్కుకున్న ఆరుగురిని అధికారులు అతికష్టం మీద కాపాడి ఒడ్డుకు చేర్చారు. జమ్మిపాలెం గ్రామానికి చెందిన ఆరుగురు పశువులు మేపేందుకు పెన్నా నదిలోకి వెళ్లారు. సోమశిల జలాశయం నుంచి నీటిని విడుదల చెయ్యడంతోపాటు, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నదిలో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. ప్రవాహ ఉద్ధృతి అధికంగా ఉండటంతో నది మధ్యలో చిక్కుకున్న వారు ఎటూ వెళ్లలేక అక్కడే చిక్కుకుపోయారు.

నది ఒడ్డున ఉన్న స్థానికులు వీరిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన కోవూరు సీఐ సుధాకర్‌రెడ్డి, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని, తాళ్ల సహాయంతో వారిని రక్షించేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. చివరకు బోట్ల సహాయంతో క్షేమంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. ఆరుగురిని రక్షించిన పోలీసు, అగ్నిమాపక సిబ్బందిని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందించారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారిని మింగేసిన బుడమేరు వరద - రెండు రోజుల తర్వాత దొరికిన మృతదేహం

వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు - వెంటనే దిగి ప్రయాణికులు - తప్పిన ప్రమాదం - Kanigiri RTC Bus Stuck in stream

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.