ETV Bharat / state

పుష్ప 2 టికెట్​ ధరలు పెంపు - ప్రభుత్వానికి అల్లు అర్జున్ ధన్యవాదాలు - ALLU ARJUN THANKED AP GOVT

'పుష్ప 2' టికెట్ ధరల పెంపునకు ఆమోదించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన అల్లు అర్జున్

allu_arjun_thanked_ap_govt
allu_arjun_thanked_ap_govt (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 2, 2024, 10:40 PM IST

Allu Arjun thanked AP Govt For increasing ticket prices: 'పుష్ప2' టికెట్‌ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు అధికారిక జీవో విడుదల చేసింది. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'పుష్ప2: ది రూల్‌' (Pushpa 2 The Rule). ఈ చిత్రం డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టికెట్‌ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

షోల వివరాలు ఇవే: డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల బెనిఫిట్ షోతో పాటు, అర్ధరాత్రి 1 గంట షోకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాత్రి 9.30 షోకు టికెట్ ధరను రూ.800గా నిర్ణయించారు. ఈ షో చూడాలంటే రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్‌ ఏదైనా సరే టిక్కెట్ రేటు రూ.800+GST చెల్లించాల్సిందే. చిత్రం విడుదలయ్యే రోజు డిసెంబర్ 5న తేదీన 6 షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్‌లలో లోయర్‌ క్లాస్‌ రూ.100, అప్పర్‌ క్లాస్‌ రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200, పెంచారు. డిసెంబర్ 6వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 5 షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబరు 17 వరకూ పెంచిన టికెట్‌ ధరలు అమల్లో ఉంటాయి.

ఈ క్రమంలో టిక్కెట్ రేట్లు పెంపునకు అనుమతి ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదల, శ్రేయస్సు పట్ల నిబద్ధతను తెలియజేస్తుందని కొనియాడారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకా సినీ పరిశ్రమను బలోపేతం చేయడంలో అమూల్యమైన సహకారం అందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​కి (Deputy CM Pawan Kalyan) కూడా ధన్యవాదాలు తెలిపారు.

'పుష్ప 2'లో చీరకట్టు సీన్స్​ - ఆసక్తికర విషయం చెప్పిన అల్లు అర్జున్!

'మాటిస్తున్నా, ఇకపై అలా చేస్తా' : ప్రభాస్​ బాటలోనే అల్లు అర్జున్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.