ETV Bharat / state

చాక్లెట్​ ఇప్పిస్తానని మూడేళ్ల బాలికపై అత్యాచారం - SEXUAL ASSAULT ON 3 YEAR OLD GIRL

మూడేళ్ల చిన్నారిపై యువకుడి లైంగిక దాడి - ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన - నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

Sexual_assault_on_3_year_old_girl
Sexual_assault_on_3_year_old_girl (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 24, 2025, 7:42 PM IST

Young Man Sexually Assaulted a Three Year Old Girl: అభంశుభం తెలియని మూడేళ్ల చిన్నారిని చాక్లెట్ ఇప్పిస్తానని నమ్మించి ఓ దుర్మార్గుడు కర్కశంగా చిదిమేశాడు. అప్పటిదాకా నవ్వుతూ ఆడుకుంటున్న ఆ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే పాప తల్లీతండ్రులను చంపేస్తానని బెదిరించాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. అయితే ఇలాంటి ఘటనపై ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎంత కఠినంగా శిక్షించినా, కీచకుల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.

వివరాల్లోకి వెళ్తే నగరి మండలంలో మూడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదే గ్రామానికి చెందిన మోహన్ అనే యువకుడు వచ్చి పాపను ఎత్తుకెళ్లి లైంగికదాడికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాక్లెట్‌ కొనిస్తానని చెప్పి పాపను ఎత్తుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరుసటి రోజు చిన్నారి తల్లి పాపకు స్నానం చేయిస్తుండగా విషయం తెలిసిందని తెలిపారు. పాపను విచారించగా తనపై జరిగిన లైంగిక దాడిని వివరించడంతో తల్లిదండ్రులు స్థానిక నగరి పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేయగా ఆ యువకుడు నేరాన్ని ఒప్పుకోవడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్​కు పంపించారు.

ఘటనపై స్పందించిన మంత్రి మండిపల్లి: మూడేళ్ల బాలికపై లైంగిక దాడి దారుణమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. చిన్నారులపై ఇటువంటి ఘటనలు ఎవరు పాల్పడినా కూటమి ప్రభుత్వం ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. లైంగిక దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని అధికారులుకు మంత్రి ఆదేశించారు. బాధిత కుటుంబానికి భరోసా కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

20ఏళ్ల యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం- ప్రైవేట్​ పార్ట్స్​లో సర్జరీ బ్లేడ్, రాళ్లు చొప్పించి!

వైఎస్సార్సీపీ నేత అరాచకం - న్యూడ్ వీడియోలతో మహిళను బెదిరించి అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.