Voters Problem in Tribal Areas : ఎన్నికల రోజునా ఆ గిరిజనులకు పాట్లు తప్పలేదు. ఓటు వేయడానికి డోలీ మోతలే దిక్కయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ నియోజకవర్గ ప్రజలు ఓటు వేయడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతగిరి మండలం బూరుగు చిన్న కొండ గ్రామం నుంచి డోలీ మోసుకుంటూ ఓటర్లు ప్రయాణించారు. వృద్ధులను, అనారోగ్యంగా ఉన్నవారిని సుమారు 10 కిలోమీటర్లు డోలీమోసి రొంపలి పోలింగ్ కేంద్రానికి తీసుకు వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్లు గడుస్తున్నా ఇదే దుస్థితి ఉందని, ఓట్లు వేసేటప్పుడు మాత్రం అది చేస్తాం ఇది చేస్తామంటున్నారే గానీ ఏమీ చేయటం లేదని వాపోయారు. ప్రస్తుతానికి ఓటు వేయడానికి కూడా మాకు ఈ పాట్లు తప్ప లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంగా ఉన్నా, సంతలకు వెళ్లాలన్నా నిత్యం పది కిలోమీటర్ల మేర కొండలు గుట్టలు దాటాల్సి వస్తోందని చెప్తున్నారు.
ఓటు వేయాలన్నా డోలీ మోతలే - 'ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్థులు' - Voters Problems - VOTERS PROBLEMS
Voters Problem in Tribal Areas : ఎన్నికలు వస్తున్నాయి, పోతున్నాయి. ప్రభుత్వాలూ మారుతున్నాయి. తప్ప ఆ గిరిజనుల రాత మారడం లేదు. ప్రతీ సారి నాయకులు హామీలు ఇవ్వడం, ఆ తర్వాత విస్మరించడం. తాజాగా పోలింగ్ రోజున కూడా డోలీ మోత తప్పలేదు. మరో ప్రాంతంలో తమ సమస్యలకు దారి చూపాలంటూ పోలింగ్‌ను బహిష్కరించారు గ్రామస్థులు.
voters_problems_in_araku_vally (Etv Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 13, 2024, 1:26 PM IST
ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్థులు..
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం గ్రామీణ మండలం ఇందిరమ్మ కాలనీ భరత్ నగర్ ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. కాలనీలో మురుగు కాల్వలు ఏర్పాటు చేయకపోవడం, సీసీ రోడ్లు వేయకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ తమ సమస్యలు పరిష్కరించే వరకు తాము ఎవరికి ఓటు వేయమని భీష్మించారు.