ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

తిరుపతి లోక్​సభ స్థానంపై కన్నేసిన బీజేపీ- వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఎవరికో! - Tirupati LOK SABHA ELECTIONS - TIRUPATI LOK SABHA ELECTIONS

Tirupati constituency : చిత్తూరు జిల్లాలో తిరుపతి స్థానం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిలుస్తోంది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ లోక్​సభ పరిధిలో ఉన్నాయి. తిరుపతి లోక్​సభ ఎస్​సీలకు రిజర్వ్‌ చేశారు.

tirupati_loksabha
tirupati_loksabha

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 20, 2024, 10:50 AM IST

Updated : Apr 20, 2024, 11:01 AM IST

Tirupati constituency : తిరుమల తిరుపతి కేంద్రంగా తిరుపతి లోక్​సభ స్థానం (Tirupati Lok Sabha constituency) ఏర్పాటైంది. గతంలో ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెల్లువెత్తంగా పలువురు ఉన్నతాధికారులపై వేటు పడింది. తిరుపతి లోక్​సభ ఎస్​సీలకు రిజర్వ్‌ చేశారు.

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు

  1. సర్వేపల్లి
  2. గూడూరు
  3. వెంకటగిరి
  4. సూళ్లూరుపేట
  5. తిరుపతి
  6. శ్రీకాళహస్తి
  7. సత్యవేడు

బెజవాడలో అన్నదమ్ముల సవాల్- బలంగా టీడీపీ, బోణీకొట్టని వైఎస్సార్సీపీ ​ - Vijayawada LOK SABHA ELECTIONS

ఓటర్ల వివరాలు

  • మొత్తం ఓటర్లు 16,99,748
  • పురుషులు 8,29,969
  • మహిళలు 8,69,621
  • ట్రాన్స్‌ జెండర్లు 158
tirupati_loksabha

ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో 12సార్లు కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించగా, వైఎస్సార్సీపీ రెండు సార్లు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఒక్కోసారి విజయం సాధించాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై వైఎస్సార్సీపీ అభ్యర్థి బల్లి దుర్గా ప్రసాద్‌రావు విజయం సాధించారు. ఆ తర్వాత 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున గురుమూర్తి గెలుపొందారు.

ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా తిరుపతి లోక్‌సభ స్థానం బీజేపీకి దక్కింది. దీంతో ఇటీవల పార్టీలో చేరిన వరప్రసాదరావును (Varaprasad Rao Velagapalli) తమ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. వాస్తవానికి వైఎస్సార్సీపీ నుంచి గూడూరు ఎమ్మెల్యే టికెట్‌ నిరాకరించిన తర్వాత వరప్రసాదరావు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కలిశారు. దీంతో ఆయన ఆ పార్టీలో చేరతారన్న ప్రచారం జరిగింది. అయితే, జిల్లాలో జనసేన కేవలం తిరుపతి అసెంబ్లీ నుంచి మాత్రమే పోటీ చేస్తుండటంతో ఆయనకు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చే అవకాశం లేదు. తిరుపతి ఎంపీ స్థానాన్ని బీజేపీకి కేటాయించిన నేపథ్యంలో ఆయన ఆ పార్టీలో చేరి టికెట్‌ దక్కించుకున్నారు. 2009లో ప్రజారాజ్యం తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వరప్రసాదరావు 2014లో వైఎస్సార్సీపీ నుంచి తిరుపతి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 2019లో గూడూరు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గెలిచారు. మరోవైపు అధికార పార్టీ నుంచి సిట్టింగ్‌ ఎంపీ మద్దిల గురుమూర్తి (Maddila Gurumoorthy) మరోసారి పోటీలో నిలిచారు.

డాల్ఫిన్​ నోస్​ సిటీ మన వాల్తేరు - విశాఖ లోక్​సభ గతం తెలుసా? - Visakhapatnam LOK SABHA ELECTIONS

గత ఎన్నికల్లో గెలిచిన నేతలు వీరే!

1952: మాడభూషి అనంత శయనం అయ్యంగార్ (కాంగ్రెస్), 1962: సి. దాస్ (కాంగ్రెస్), 1967: సి. దాస్ (కాంగ్రెస్), 1971: టి. బాలకృష్ణయ్య (కాంగ్రెస్), 1977: టి. బాలకృష్ణయ్య (కాంగ్రెస్), 1980: పసల పెంచలయ్య (కాంగ్రెస్), 1984: చింతా మోహన్ (కాంగ్రెస్) గెలుపొందారు

గత ఎన్నికల్లో విజేతలు - సమీప ప్రత్యర్థులు

  • 1989: చింతా మోహన్ (కాంగ్రెస్) - ఎం. మురగయ్య (టీడీపీ)
  • 1991: చింతా మోహన్ (కాంగ్రెస్) - పి. సుబ్బయ్య (టీడీపీ)
  • 1996: నేలవాల సుబ్రహ్మణ్యం (కాంగ్రెస్) - గాలి రాజశ్రీ (టీడీపీ)
  • 1998: చింతా మోహన్ (కాంగ్రెస్) - డా.ఎన్.శివప్రసాద్ (టీడీపీ)
  • 1999: డా.నందిపాకు వెంకటస్వామి (బీజేపీ) - చింతా మోహన్ (కాంగ్రెస్)
  • 2004: చింతా మోహన్ (కాంగ్రెస్) - డా.నందిపాకు వెంకటస్వామి​ (బీజేపీ)
  • 2009: చింతా మోహన్ (కాంగ్రెస్) - వర్ల రామయ్య (టీడీపీ)
  • 2014: వర ప్రసాదరావు (వైఎస్సార్సీపీ) - కారుమంచి జయరాం​ (టీడీపీ)
  • 2019: బల్లి దుర్గా ప్రసాద్‌ రావు (వైఎస్సార్సీపీ) - పనబాక లక్ష్మి​ (టీడీపీ)
  • 2021: (ఉప ఎన్నిక) మద్దిలి గురుమూర్తి (వైఎస్సార్సీపీ) - పనబాక లక్ష్మి​ (టీడీపీ)
Last Updated : Apr 20, 2024, 11:01 AM IST

ABOUT THE AUTHOR

...view details