ETV Bharat / politics

ప్రజలు అనుకుంటే ఏదైనా సాధ్యం - వాళ్లే నాకు హైకమాండ్​: సీఎం - CHANDRABABU COMMENTS AT YALLAMANDA

పల్నాడు జిల్లా యల్లమందలో సీఎం చంద్రబాబు పర్యటన - పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

CM_Chandrababu_Comments
CM Chandrababu at Yallamanda (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 31, 2024, 3:45 PM IST

CM Chandrababu Comments at Yallamanda: డ్రోన్స్‌ ద్వారా వ్యవసాయానికి శ్రీకారం చుట్టబోతున్నామని, రాబోయే రోజుల్లో రైతులకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. తెగుళ్లు ఉందని అనుమానం రాగానే డ్రోన్స్‌ వస్తాయని, వ్యవసాయంలో ఖర్చు తగ్గాలని, ఆదాయం పెరగాలని తెలిపారు. అందరికంటే ఎక్కువ అప్పుల్లో ఉండేది రైతులేనని అన్నారు. పల్నాడు జిల్లా యల్లమందలో సీఎం చంద్రబాబు పర్యటించారు. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో గ్రామస్థులతో మాట్లాడారు.

అందుకే ఇక్కడకి వచ్చా: ప్రజల స్థితిగతులు తెలుసుకుని న్యాయం చేయడానికే తాను వచ్చానని సీఎం చంద్రబాబు తెలిపారు. మీ కష్టాల్లో భాగం పంచుకోవడానికే వచ్చానని, ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పనులు చేయించాలనేదే తన తపన అని అన్నారు. ఇంటింటికి వచ్చి పింఛన్‌ అందిస్తున్నామని, ఇంటి వద్ద ఇవ్వకుండా ఆఫీస్‌లో ఇస్తే వెంటనే మెమో పంపిస్తామని వెల్లడించారు. ఫోన్లో జీపీఎస్‌ ద్వారా సమాచారం వస్తుందని, డ్రోన్‌తో కూడా సహాయ కార్యక్రమాలు చేస్తున్నామని గుర్తు చేశారు. పేదవాళ్ల జీవితాల్లో వెలుగు చూడాలన్న ఏకైక లక్ష్యంతో ఉన్నామని స్పష్టం చేశారు.

పింఛన్ పంపిణీ చేసి - కాఫీ కలిపి లబ్ధిదారులకు ఇచ్చిన చంద్రబాబు

గత ఐదేళ్లు కనీసం నవ్వలేకపోయారు: గత ఐదేళ్లు బయటకు పోలేని పరిస్థితి అని, కనీసం నవ్వలేకపోయారని చంద్రబాబు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ పాలనలో కంపెనీలన్నీ రాష్ట్రం నుంచి పారిపోయాయని, ఇవాళ ఒక్కో కంపెనీ రాష్ట్రంలోకి మళ్లీ వస్తున్నాయని తెలిపారు. విధ్వంస పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగిందన్న చంద్రబాబు, ఆడబిడ్డలపై సోషల్‌ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే తాటతీస్తానని హెచ్చరించారు. మంచివాళ్లకు మంచిగా ఉంటానని, దారితప్పితే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు.

పార్టీ కోసం పనిచేసిన వారిని ఎప్పటికీ మరచిపోలేం: కాసేపటి క్రితమే శారమ్మ ఇంటికెళ్లానని, 2021లో ఆమె భర్త కరోనాతో చనిపోయారని తెలిపారు. ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ జీవితాన్ని వెళ్లదీస్తోందని అన్నారు. ఐదు కోట్ల ప్రజల కోసమే తాను కష్టపడుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. తాను ఏం చేసినా అందరికీ న్యాయం జరగాలనేదే తన ఆలోచన అని, శారమ్మ కుమార్తెకు నీట్‌ కోచింగ్‌ ఇప్పించాలని అధికారులకు సూచించానన్నారు. డాక్టర్‌ కావాలని పేద కుటుంబం కోరుకుంటోందని, శారమ్మ కుమారుడికి రూ.3 లక్షలు రుణం ఇప్పించాలని అధికారులకు చెప్పానన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని ఎప్పటికీ మరచిపోలేమని, 90 లక్షలమంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారని వెల్లడించారు.

చరిత్ర తిరగరాయబోయే ప్రాజెక్టు - పూర్తైతే తెలుగుతల్లికి జలహారతి ఇచ్చినట్లే : సీఎం చంద్రబాబు

ఐదు కోట్లమంది ప్రజలే నాకు హైకమాండ్: పార్టీ సిద్ధాంతాలు ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలని, పార్టీ కార్యకర్తలకు అన్నివిధాలుగా అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు. పింఛన్లు ఒకరోజు ముందే 31వ తేదీనే ఇస్తున్నామని, ప్రజలు అనుకుంటే ఏదైనా సాధ్యం చేస్తారని పేర్కొన్నారు. టీడీపీని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారని, తనకు హైకమాండ్‌ ఎవరూ లేరని, ఐదు కోట్లమంది ప్రజలే తన హైకమాండ్ అని వెల్లడించారు.

ఏకైక రాష్ట్రం ఏపీ: తెలుగువారంతా చేసుకునే పండుగ సంక్రాంతి అని, మళ్లీ మీ అందరి జీవితాల్లో శుభం జరగాలని ఆశించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే బాధ్యత తనదన్న సీఎం, ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి మన్మోహన్‌సింగ్‌ అని గుర్తు చేసుకున్నారు. రాజకీయాలకు అతీతంగా మన్మోహన్‌ మృతికి సంతాపం తెలపాలని సూచించారు. పేదరికం లేని సమాజం ఎన్టీఆర్‌ కల అని తెలిపారు. సంపద సృష్టించాలి, పేదలకు పంచాలి, కష్టాల్లో ఉన్న పేదలకు అండగా ఉండాలని చంద్రబాబు అన్నారు. 64 లక్షల మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఏపీ అని వెల్లడించారు.

గుడ్​న్యూస్ - వారందరికీ జీతంతో పాటు 4 వేల రూపాయలు అదనం

పేదరికం లేని సమాజం నా జీవిత ఆశయం: మంచి నాయకుడు ఉంటే అంతా మంచే జరుగుతుందని, రూ.4 వేల పింఛన్‌ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని చెప్పారు. జూన్‌లో అధికారంలోకి వచ్చినా ఏప్రిల్‌ నుంచే పింఛన్లు ఇచ్చామని, పేదరికం లేని సమాజం తన జీవిత ఆశయమని అన్నారు. పేదవాళ్ల ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్లు పెట్టామని, 198 అన్న క్యాంటీన్లు పెట్టామని, అవసరమైతే ఇంకా పెడతామన్నారు. పేదవాళ్లకు ఉచితంగా అన్నం పెట్టే బాధ్యత తమదని, తన జీవితంలో ఎప్పుడూ చూడని విధ్వంసం గత ఐదేళ్లలో చూశానని, అన్ని వ్యవస్థలను దోపిడీ చేసి ధ్వంసం చేశారని మండిపడ్డారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ దారి మళ్లించేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ బాధ్యత నాది: గుంతలు లేని రహదారులుగా మార్చే బాధ్యత తమదని, తాను అధికారంలోకి రాగానే చెత్తపై పన్ను ఎత్తేశామని గుర్తు చేశారు. మత్స్యకారుల ఉపాధి దెబ్బతీసే 217 జీవో రద్దు చేశామని, స్వర్ణకారులకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేశామని, మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు 10 శాతం కేటాయించామని వెల్లడించారు. అదే విధంగా చేనేత కార్మికులకు జీఎస్టీ ఎత్తివేశామని, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే ఖాతాల్లో డబ్బు వేస్తున్నామని తెలిపారు. నదుల అనుసంధానంతో నీటి కొరత లేకుండా చేస్తామన్నారు.

కరవు రహిత రాష్ట్రంగా తయారుచేస్తాం: నేల తల్లికి జలహారతి ద్వారా శ్రీకారం చుడుతున్నామన్న సీఎం చంద్రబాబు, గోదావరి నుంచి 3 వేల టీఎంసీల నీళ్లు సముద్రంలోకి పోతున్నాయన్నారు. ఈ ఏడాది కృష్ణాలో వచ్చిన వరదల సమయంలో 800 టీఎంసీలు సముద్రంలోకి పోయాయని, 300 టీఎంసీలు మనం వాడుకోగలిగితే నీటి కొరత ఉండదని చెప్పారు. కరవు రహిత రాష్ట్రంగా తయారుచేసే బాధ్యత మేం తీసుకుంటామని స్పష్టం చేశారు.

గుడ్​న్యూస్ - ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.