SIT investigation : పల్నాడు జిల్లా నరసరావుపేటలో సిట్ అధికారులను కలిసేందుకు మంత్రి అంబటి రాంబాబును అనుమతించిన పోలీసులు జనసేన నేతలను నాలుగు గంటలకు పైగా బయటనే నిలిపివేశారు. ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో ఆదివారం సిట్ సభ్యులు నరసరావుపేట గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో విచారణ చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో మంత్రి అంబటి రాంబాబు సిట్ సభ్యులను కలిసి నకరికల్లు మండలంలో జరిగిన ఘర్షణలకు సంబంధించి సత్తెనపల్లి రూరల్ సీఐ రాంబాబుపై ఫిర్యాదు చేశారు. ఆయనకు ఆహ్వానం పలికిన స్థానిక ఎస్సై రోశయ్య వైఎస్సార్సీపీ వర్గీయుల చేతిలో దెబ్బలు తిన్న నరసరావుపేట మండలం పమిడిపాడుకు చెందిన జనసేన నాయకులు పదిమంది వరకూ వస్తే లోపలకు రానివ్వకుండా అడ్డుకున్నారు. తమకు కలిసే అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడితే నాలుగు గంటల పాటు బయటనే ఉంచారు. వైఎస్సార్సీపీ వర్గీయుల ఫిర్యాదు మేరకు తమకు 41ఏ నోటీసులు పంపిన పోలీసులు కౌంటర్ ఫిర్యాదు తీసుకోవడం లేదని బాధితులు వెల్లడించారు. ఈ విషయాన్ని సిట్ సభ్యులకు తెలిపేందుకు వస్తే అడ్డుకున్నారని జనసేన నేతలు వాపోయారు.
నాటు బాంబులు, పెట్రోల్ సీసాల దాడులతో రక్తసిక్తమైన పల్నాడు - YSRCP attacks in Palnadu
పల్నాడు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దాడులు, ఘర్షణలకు సంబంధించిన అంశాలపై సిట్ లోతైన విచారణ చేపట్టింది. నరసరావుపేట, కారంపూడి, దాచేపల్లిలో పోలీసుల నుంచి సమగ్ర సమాచారం సేకరించినట్లు సమాచారం. హింసాత్మక ఘటనలకు సంబంధించి నమోదైన కేసులు, అల్లర్ల సమయంలోని వీడియో ఫుటేజ్‌ను సిట్ బృందం క్షుణంగా పరిశీలించింది. నరసరావుపేట రూరల్ స్టేషన్‌లో ఉదయం 10 గంటలకు మొదలైన విచారణ.. రాత్రి వరకూ కొనసాగింది. రూరల్ సర్కిల్ పరిధిలో మొత్తం నాలుగు ఘటనలు చోటు చేసుకోగా, వీటిలోదొండపాడు పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంఎల్‌ఏ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు కార్లపై రాళ్ల దాడి జరిగింది. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లనివ్వకుండా ఇద్దరినీ అడ్డుకోవడమే కాకుండా తోసేశారు. నూజండ్ల మండలం పమిడిపాడులో అధికార పార్టీ నాయకులు టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడగా సంబంధిత వీడియోలను సిట్ సభ్యులు పరిశీలించారు. రూరల్ ఎస్సై అధికారపార్టీతో అంటకాగుతున్నారనే ఆరోపణలున్న నేపథ్యంలో ఎవరెవరిపై ఎలాంటి కేసులు నమోదు చేశారు? వారికి 41ఏ నోటీసులు ఇచ్చారా? అదుపులోకి తీసుకున్నారా? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ ఒక్క నరసరావుపేట గ్రామీణ ఠాణాలో ఎఫ్‌ఐఆర్‌లను పరిశీలించారు. పట్టణంలో గొడవలు జరిగిన ప్రాంతాలను సిట్ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, పోలీసు అధికారులు పరిశీలించారు. మున్సిపల్ హైస్కూల్, మల్లమ్మ సెంటర్, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి స్థలాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రణరంగంగా తాడిపత్రి - రహస్య ప్రాంతానికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి తరలింపు - High Tension In Tadipatri
శ్రీకాకుళం ఏసీబీ ఏఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సిట్ బృందం రెంటచింతల మండలంలో పర్యటించింది. రెంటాల, తుమృకోట, పాలవాయిగేటు గ్రామాల్లో అల్లర్లు జరిగిన ప్రదేశాలను సందర్శించారు. కారంపూడిలో ఘటనా స్థలాలను పరిశీలించిన అనంతరం స్టేషన్ వెళ్లి రికార్డులు తనిఖీ చేశారు. స్టేషన్ సమీపంలోనే అల్లర్లు జరిగినా ఎందుకు త్వరగా అదుపు చేయలేకపోయారు? పరిస్థితి చేయిదాటేవరకూ ఏం చేశారని పోలీసులను ప్రశ్నించినట్లు తెలిసింది. ఇప్పటివరకూ ఇరుపార్టీల్లో ఎంతమందిని అరెస్టు చేశారని అడిగిన సిట్ సభ్యులు కొన్ని ఎఫ్‌ఐఆర్ పత్రాల జిరాక్స్ ప్రతులు తీసుకెళ్లారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు దాచేపల్లి పోలీసుస్టేషన్‌కు చేరుకుని సీఐ సురేంద్రబాబును విచారించారు. బాధితులను హింసించిన ఘటనపై సీఐని ప్రశ్నించినట్లు సమాచారం.