MP Kalisetti Responds Allegations On Margadarsi: మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎంతో మంది జీవితాల్లో అనుకున్న ఆర్థిక లక్ష్యాలను చేరుకోవటానికి ఉపయోగపడుతోందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. మార్గదర్శి చిట్స్‌పై ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. తన తండ్రి పెద్దిరెడ్డి అరాచకాలను ఈనాడు వార్తా సంస్థ ఆధారాలతో ప్రచురిస్తున్నందుకే మిథున్ రెడ్డి మార్గదర్శిపై కక్షపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. 1995లోనే తాను మార్గదర్శిలో సభ్యుడిగా చేరానని ఇప్పటికీ పలువురు కుటుంబ సభ్యులు మార్గదర్శిలో చిట్స్ కడుతున్నారని ఎంపీ పేర్కొన్నారు.
మార్గదర్శిపై 2006లో ఇదే విధంగా తప్పుడు ఆరోపణలు చేశారని గుర్తు చేసుకున్నాడు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ మద్దతుదారులతో సహా వేలాది మంది ప్రజలు శ్రీకాకుళం జిల్లాలో సంస్థకు మద్దతుగా ర్యాలీ చేశారన్నారు. తప్పుడు ఆరోపణలు ఉన్నప్పటికీ, మారదర్శి సమాజంలో విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిందన్నారు. మార్గదర్శిపై నిరాధార ఆరోపణలు చేసేవారు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈనాడు, మార్గదర్శి వంటి సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేందుకు వైఎస్సార్సీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.
ఆరోగ్య, ఆనంద సమాజమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: చంద్రబాబు
అభివృద్ధి దిశగా ఏపీ అడుగులు: సీఎం చంద్రబాబు పాలనను, నాయకత్వాన్ని ఎంపీ ప్రశంసించారు. అనేక సవాళ్లు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. జగన్ హయాంలో వైఎస్సార్సీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు గణనీయమైన అభివృద్ధిని చూస్తున్నాయని ఎంపీ కలిశెట్టి విశ్వాసం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీలో ఒక కోటికి పైగా ప్రజలు చేరడం వల్ల ఒక ప్రధానమైన మైలురాయిని చేరుకుందని ప్రకటించారు. లోకేశ్ ఆధ్వర్యంలో పార్టీ ఒక కోటి మంది సభ్యులను చేరుకున్న ఘనతను సాధించిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి మంత్రి లోకేశ్ దిల్లీలోని కేంద్ర మంత్రులతో సమావేశాల్లో చురుకుగా పాల్గొంటున్నారని తెలిపారు.
ఈ ఏడాదే తల్లికి వందనం, అన్నదాత, ఉచిత బస్సు - బడ్జెట్‌పై చంద్రబాబు చర్చ
'మరోసారి ఇలా చేస్తే సహించేది లేదు' - మంత్రులు, కార్యదర్శులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం