రాష్ట్రంలో జోరుగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం Lok Sabha Elections Campaign in Telangana 2024 :రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా హోరాహోరీగా సాగుతోంది. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణకు మద్దతుగా మంథనిలో మంత్రి శ్రీధర్‌బాబు, సినీ నిర్మాత బండ్ల గణేశ్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. హస్తం పార్టీ జాతీయ మేనిఫెస్టోను ఇంటింటికి ప్రచారం చేసి వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Lok Sabha Elections 2024 :ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కోరారు. మెదక్ హస్తం పార్టీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్‌లో ప్రచారం నిర్వహించారు. జిల్లాలో ఇవాళ జరగబోయే సీఎం రేవంత్‌రెడ్డి రోడ్ షోను అందరూ విజయవంతం చేయాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహత్‌రావు కోరారు.
హరీశ్‌రావు మరోసారి ప్రజలను మోసగించే ప్రయత్నం :నల్గొండ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్‌రెడ్డికి మద్దతుగా, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రచారం చేపట్టారు. దొంగ రాజీనామా లేఖలతో హరీశ్‌రావు మరోసారి ప్రజలు మోసగించడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారని ఆయన విమర్శించారు. ఖమ్మం హస్తం పార్టీ అభ్యర్థి రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ వైరా, సత్తుపల్లి, ఏన్కూరు, తల్లాడ మండలాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రోడ్ షో నిర్వహించారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేసిన నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని పొంగులేటి డిమాండ్ చేశారు.
Congress Campaign in Telangana 2024 :కరీంనగర్ జిల్లా వేములవాడలో కాంగ్రెస్ కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుకు మద్దతుగా, ప్రచారం నిర్వహించారు. భువనగిరి హస్తం పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్‌రెడ్డికి మద్దతుగా, ప్రభుత్వవిప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం చేపట్టారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో వరంగల్ లోక్‌సభ అభ్యర్థి కడియం కావ్య గెలుపును కాంక్షిస్తూ ఎమ్మెల్యే నాగరాజు, కడియం శ్రీహరి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. కడియం కావ్య గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు.
ప్రచారాన్ని హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీలు - ప్రత్యర్థి అభ్యర్థులే లక్ష్యంగా మాటల దాడులు - Lok Sabha Campaign in Telangana
BRS Election Campaign 2024 :లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ హోరెత్తిస్తోంది. కరీంనగర్ లోక్‌సభ గులాబీ పార్టీ అభ్యర్థి వినోద్‌కుమార్, చింతకుంటలో మాజీమంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి కార్నర్ మీటింగ్ నిర్వహించారు. బండి సంజయ్ గెలుపు కోసమే కాంగ్రెస్ ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించిందని ఆరోపించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని ముస్లిం మైనార్టీ ముఖ్య నాయకులతో మల్కాజిగిరి భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సమావేశమయ్యారు. మైనార్టీలు ఏకతాటిగా కారు గుర్తుపై ఓటువేసి తనను గెలిపించాలని ఆయన కోరారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి, ఇల్లందులో కేసీఆర్ కాన్వాయ్‌పై మహిళలు పూలవర్షం కురిపించారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని కోరుట్లలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నల్గొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి కోరారు. సూర్యాపేటలో గడప గడపకు తిరుగుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు.
BJP Election Campaign 2024 :రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు డివిజన్‌ల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తప్పుడు ప్రచారాలు, ఫేక్ వీడియోలు సృష్టించి ప్రత్యర్థి పార్టీలు గెలవాలని చూస్తున్నాయని లక్ష్మణ్ విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ నేత అందెల శ్రీరాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపు నల్లేరు మీద నడకే అని విశ్వాసం వ్యక్తంచేశారు.
నైతికంగా కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు : మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ రోడ్ షో నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరి, మళ్లీ దొంగ హామీలతో కాంగ్రెస్ గెలవాలని చూస్తోందని దుయ్యబట్టారు. నిజామాబాద్‌లో కమలం పార్టీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. భారతీయ జనతా పార్టీపై తప్పుడు ప్రచారంతోనే, నైతికంగా హస్తం పార్టీ అభ్యర్థులు ఓడిపోయారని ఆయన ఆరోపించారు.
ప్రచారాన్ని హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీ నేతలు - అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యం - main Parties Campaign in Telangana
రాష్ట్రంలో ఊపందుకున్న ప్రధాన పార్టీల ప్రచారం - ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలతో అభ్యర్థుల ఎదురుదాడి - lok sabha elections 2024