ETV Bharat / politics

'గురుకులాల్లో ఫుడ్​ పాయిజన్ కుట్రల వెనక - బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ హస్తం' - KONDA SUREKHA COMMENTS ON BRS

గురుకులాల్లో కుట్రల వెనుక బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ హస్తముందన్న మంత్రి కొండా సురేఖ - ప్రవీణ్ తన అనుచరుల ద్వారా గురుకులాల్లో కుట్రలు చేస్తున్నారని విమర్శ

Konda Surekha Comments On BRS
Konda Surekha Comments On BRS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 29, 2024, 7:50 PM IST

Updated : Nov 29, 2024, 9:27 PM IST

Konda Surekha Comments On BRS : గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల వెనక బీఆర్ఎస్ పార్టీ ఉందని రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. బీఆర్ఎస్ నేత, గురుకులాల మాజీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ద్వారా కేటీఆర్ కుట్ర చేస్తున్నారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్​కు గురుకులాల్లో అనుచరులు ఉన్నారన్నారు. అందువల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని సందేహం వ్యక్తం చేశారు. ప్రవీణ్ కుమార్ హయాంలో గురుకులాల్లో అక్రమాలు జరిగాయని కొండా సురేఖ విమర్శించారు.

అన్ని విషయాలు బయటకు వస్తాయి : కేటీఆర్ అండ్ టీం అభివృద్ధిని అడ్డుకుంటూ పక్కా ప్రణాళికతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ఉందని అన్ని విషయాలు బయటకు వస్తాయని కొండా సురేఖ హెచ్చరించారు. కేటీఆర్​కు ఆయన చేసిన తప్పులు తెలుసు కాబట్టే జైలుకు పోతానంటూ పదేపదే అంటున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. కవిత జైలు నుంచి బయటకు రాగానే కేసీఆర్ ఆమెకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని దాంతో కేటీఆర్ మానసికంగా ఇబ్బంది పడుతున్నారని మంత్రి కొండా సురేఖ అన్నారు. కేసీఆర్ కుటుంబంలో కవిత, హరీశ్ రావు ఒక్కటయ్యారని చర్చ జరుగుతోందన్నారు. సమయం వచ్చినప్పుడు కేటీఆర్​తో పాటు కేసీఆర్ కూడా జైలుకు వెళ్తారని మంత్రి ధ్వజమెత్తారు.

"గత ప్రభుత్వంలో వాళ్లు(బీఆర్ఎస్) ఏ ఒక్కరోజు కూడా గురుకుల ఆశ్రమ పాఠశాలల్లోకి వెళ్లి ఏవిధంగా పిల్లలు ఉన్నారు? వారి భోజన సదుపాయాలు సరిగా ఉన్నాయా? వసతులు ఏవిధంగా ఉన్నాయి? అనే విషయాలను పరిశీలించిన సందర్భాలు లేవు. మా ప్రభుత్వం వచ్చాక ఒక్కటే ఘటన జరిగింది. అది జరగడం చాలా బాధాకరం. ఒక ప్రణాళికతో కావాలని ప్రభుత్వాన్ని పనిచేయకుండా చేసే కార్యక్రమం జరుగుతోంది.​ ప్రవీణ్​కుమార్ గతంలో గురుకులాల సెక్రటరీగా చేశారు. ఇప్పుడు జరిగిన ఘటనలన్నింటికీ ఆర్ఎస్​ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని నమ్ముతున్నాను"- కొండా సురేఖ, మంత్రి

మంత్రి కొండా సురేఖ మనసు కరిగిపోయింది - ఆ చిన్నారిని చూసి వెంటనే కారాపింది!

మళ్లీ మంత్రి కొండా సురేఖ కామెంట్స్ - ఈసారి ఏమన్నారంటే? - Minister Konda Surekha Comments

Last Updated : Nov 29, 2024, 9:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.