రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల గడువు - ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే - Nominations Deadline Ended - NOMINATIONS DEADLINE ENDED
Parliament Elections Nominations Deadline Ended : రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల గడువు ముగిసింది. మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గానూ దాదాపు 700 మంది వరకు నామినేషన్లు దాఖలు చేశారు.
Parliament Elections Nominations 2024 Deadline Ended : లోక్‌సభ ఎన్నికల సమరంలో ఓ కీలక ఘట్టం ముగిసింది. నేటితో నామినేషన్ల గడువు పూర్తయింది. ఎంతో కీలకమైన ఈ ఘట్టానికి ఈ నెల 18న నోటిఫికేషన్ వెలువడగా, అదే రోజు నుంచి నామినేషన్లు ప్రారంభమయ్యాయి. మొత్తం 17 స్థానాల్లో బుధవారం వరకు 603 మంది పోటీలో నిలవగా, చివరి రోజైన నేడు పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. నేటితో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియడంతో రేపటి నుంచి పరిశీలన జరగనుంది. 29న ఉపసంహరణ గడువుగా నిర్ణయించారు. మరోవైపు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకూ నామినేషన్ల గడువు ముగిసింది. 17 ఎంపీ స్థానాలు, ఒక ఎమ్మెల్యే స్థానానికి మే 13న ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
ఈసారి ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే :
క్రమ
సం.
పార్లమెంట్ నియోజకవర్గం
కాంగ్రెస్
బీజేపీ
బీఆర్ఎస్
ఎం
ఐఎం
1.
హైదరాబాద్
మహమ్మద్ వలీవుల్లా సమీర్
కొంపెల్ల మాధవీ లత
గడ్డం శ్రీనివాస్ యాదవ్
అసదుద్దీన్ ఒవైసీ
2.
ఖమ్మం
రామసహాయం రఘురాంరెడ్డి
తాండ్ర వినోద్ రావు
నామ నాగేశ్వర రావు
3.
ఆదిలాబాద్
ఆత్రం సుగుణ
గోడం నగేశ్
ఆత్రం సక్కు
4.
పెద్దపల్లి
గడ్డం వంశీకృష్ణ
గోమాసె శ్రీనివాస్
కొప్పుల ఈశ్వర్
5.
కరీంనగర్
వెలిచాల రాజేందర్ రావు
బండి సంజయ్
బోయినపల్లి వినోద్ కుమార్
6.
నిజామాబాద్
తాటిపర్తి జీవన్ రెడ్డి
ధర్మపురి అర్వింద్
బాజిరెడ్డి గోవర్దన్
7.
జహీరాబాద్
సురేశ్ షెట్కార్
బీబీ పాటిల్
గాలి అనిల్‌కుమార్
8.
మెదక్
నీలం మధు
రఘునందన్ రావు
వెంకట్రామిరెడ్డి
9.
మల్కాజిగిరి
పట్నం సునీతా మహేందర్ రెడ్డి
ఈటల రాజేందర్
రాగిడి లక్ష్మారెడ్డి
10.
సికింద్రాబాద్
దానం నాగేందర్
గంగాపురం కిషన్‌రెడ్డి
తీగుళ్ల పద్మారావు
11.
చేవెళ్ల
గడ్డం రంజిత్ రెడ్డి
కొండా విశ్వేశ్వర్ రెడ్డి
కాసాని జ్ఞానేశ్వర్
12.
మహబూబ్‌నగర్
చల్లా వంశీచంద్ రెడ్డి
డీకే అరుణ
మన్నె శ్రీనివాస్ రెడ్డి
13.
నాగర్ కర్నూల్(ఎస్సీ)
మల్లు రవి
పోతుగంటి భరత్
ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్
14.
నల్గొండ
కందూరి రఘువీర్ రెడ్డి
శానంపూడి సైదిరెడ్డి
కంచర్ల కృష్ణారెడ్డి
15.
భువనగిరి
చామల కిరణ్‌కుమార్ రెడ్డి
బూర నర్సయ్య గౌడ్
క్యామ మల్లేశ్
16.
వరంగల్ (ఎస్సీ)
కడియం కావ్య
ఆరూరి రమేశ్
మారపల్లి సుధీర్ కుమార్
17.
మహబూబాబాద్ (ఎస్టీ)
పోరిక బలరాంనాయక్
అజ్మీరా సీతారాం నాయక్
మాలోత్ కవిత
పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరగనున్న కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో బీఆర్ఎస్ తరఫున దివంగత మాజీ ఎమ్మెల్యే నందిత సోదరి నివేదిక బరిలో నిలవగా, కాంగ్రెస్ తరఫున నారాయణ్ శ్రీ గణేశ్, బీజేపీ తరఫున వంశా తిలక్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.