తెలంగాణ

telangana

ETV Bharat / politics

గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రచారాలు - ఎన్నికల తర్వాక బీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయమన్న నేతలు - Lok Sabha Elections 2024

Telangana Congress Leaders Campaign 2024 : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పోటీనే లేదని బీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయమని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి, ఫోన్‌ ట్యాపింగ్‌లతో గులాబీ పార్టీ ప్రతిష్ట మసకబారిందని బీజేపీని సైతం ప్రజలు నమ్మరని ధీమాతో ఉన్నారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా కాంగ్రెస్‌ అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telangana Team

Published : Mar 31, 2024, 7:30 AM IST

గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రచారాలు - ఎన్నికల తర్వాక బీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయమన్న నేతలు

Telangana Congress Leaders Campaign 2024 :లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. విస్తృతంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నియోజకవర్గం మట్టపల్లిలో నల్గొండ పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏఐసీసీ ఇంఛార్జ్‌ దీపా దాస్‌మున్షీ హాజరయ్యారు. కార్యకర్తల శ్రమ వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని మున్షీ వ్యాఖ్యానించారు.

ఏప్రిల్ 6న తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ - ఆరోజే మేనిఫెస్టో ప్రకటన - Lok Sabha Elections 2024

Telangana Congress Campaign In Nalgonda 2024 :తనను అన్ని విధాలుగా ఆదరించిన ప్రజలు,కార్యకర్తలు తన కుమారుడు రఘవీర్‌కు కూడా బాసటగా నిలవాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి కోరారు. బీజేపీ, బీఆర్ఎస్ తమకు పోటీయే కాదని ఎంపీగా రఘువీర్‌రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరవు వచ్చిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు దోచుకుని మళ్లీ కరవు యాత్రలు బయల్దేరడం ఏమిటని విమర్శించారు. నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. పదేళ్ల పాలనలో నిజామాబాద్‌కు బీఆర్ఎస్, బీజేపీ చేసిందేమీలేదని ఆయన విమర్శించారు.

"లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగైపోతుంది. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్షల కోట్లు దోచుకుని మళ్లీ కరవు యాత్రలు బయల్దేరడం ఏమిటి. పంటల సాగుకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కాంగ్రెస్​ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్, బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదు. -కాంగ్రెస్ నాయకులు

Telangana Congress Public Meeting In Tukkuguda : లోక్‌సభ ఎన్నికల్లో కీలకమైన ఐదు అంశాలతో కూడిన జాతీయ మేనిఫెస్టోను కాంగ్రెస్‌పార్టీ ఏప్రిల్‌ 6వ తేదీన తుక్కుగూడలో నిర్వహించే జనజాతర సభలో ప్రకటించనున్నారు. ఈ సభలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ వీటిని వెల్లడించనున్నారు. ఈ భారీ బహిరంగసభ నుంచే కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని పీసీసీ నిర్ణయించింది. ఈ సభకు అన్ని జిల్లాల నుంచి భారీగా ప్రజలను రప్పించేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం వ్యూహరచనలు చేస్తోంది. ఈ సభను పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ సమావేశానికి సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే సైతం హాజరయ్యే అవకాశం ఉంది.

జాతీయ మేనిఫెస్టోలో తెలంగాణకు చెందిన అనేక అంశాలు : మంత్రి శ్రీధర్‌ బాబు - Congress National Manifesto 2024

నేడు దిల్లీకి సీఎం రేవంత్​ రెడ్డి - మిగిలిన 4 లోక్‌సభ స్థానాల అభ్యర్థులపై తుది నిర్ణయం - Lok Sabha Elections 2024

ABOUT THE AUTHOR

...view details