'రేవంత్ సాబ్ బీఆర్ఎస్ నుంచి ఏ ఇబ్బంది ఉండదు - కానీ మీ వాళ్లతో మాత్రం జరభద్రం' Telangana Budget Sessions Today 2024 :తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో భాగంగా ఏడోరోజైన నేడు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆర్థిక పరిస్థితులు, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. అనంతరంబడ్జెట్(Telangana Assembly Sessions 2024)పై చర్చ మొదలైంది. ఇక ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్‌పై చర్చకు సమాధానం ఇచ్చారు.
BRS MLA Kadiyam Srihari On CM Revanth :అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌కు సొంత పార్టీ నాయకుల నుంచే సమస్యలు వస్తాయని, వారితో ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న కడియం, సీఎం రేవంత్‌కు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ రకమైన ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. అంతకుముందు మాట్లాడుతూ తానూ, రేవంత్ ఒకే స్కూల్‌లో చదువుకున్నామని, ఆయన తనకు జూనియర్ అని చెప్పారు.
అంతకుముందు బడ్జెట్ గురించి మాట్లాడిన కడియం శ్రీహరి (BRS MLA Kadiyam Srihari in Assembly) గతేడాది ద్రవ్యలోటు రూ.33 వేల కోట్లుగా ఉందని తెలిపారు. కానీ ఈసారి బడ్జెట్‌లో ద్రవ్యలోటు భారీగా కనబడుతోందని అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారో జవాబివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం పూర్తి చేసిన నియామకాలు తమవిగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో నోటిఫికేషన్ వేసి, పరీక్షలు నిర్వహించిన ఉద్యోగాలను తామే ఇచ్చినట్లు కొత్త ప్రభుత్వం చెబుతోందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం నాటి నోటిఫికేషన్లు కాకుండా కొత్తగా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
'రియాల్టీకి దూరంగా భ్రమలు కల్పిస్తే ప్రమాదం - అందుకే వాస్తవ పద్దు రూపొందించాం'
వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ కుదించుకున్నామన్నారు. రూ.2.75 లక్షల కోట్ల బడ్జెట్ ఏమాత్రం సరిపోయే పరిస్థితి లేదు. దుబారాపై అధ్యయనం చేసి వాస్తవ బడ్జెట్ చేయాల్సి ఉంది. అలాగే మా ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించాం. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వల్ల నియామక పత్రాలు ఇవ్వలేకపోయాం. ప్రజల తీర్పుతో మీరు అధికారంలోకి వచ్చారు. గత సర్కార్ ఇచ్చిన ఉద్యోగాలను మీరే ఇస్తున్నట్లు చెప్పుకోవడం ఏ మాత్రం బాగోలేదు. -కడియం శ్రీహరి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కడియం వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy on BRS) స్పందించారు. నిరుద్యోగులను గతంలో మీరు మోసగించినట్లు మేమూ మోసగిస్తామనడం సరికాదని హితవు పలికారు. బీఆర్ఎస్ పార్టీది ప్రతిపక్షం కాదని, ఫ్రస్టేషన్ పక్షమని ఎద్దేవా చేశారు. నల్గొండలో హోంగార్డు చనిపోతే బాధిత కుటుంబాన్ని ఆదుకోలేదని, తెలంగాణ వచ్చాక మొదటి సీఎం దళితుడే అని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. దళితుడిని సీఎం చేయకపోతే తన తల తీసుకుంటానని కేసీఆర్ చెప్పారని, అసలు ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు.
మేం కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఉద్యోగాలకు సంబంధించి న్యాయ వివాదాలు పరిష్కరించి ఉద్యోగాలు ఇచ్చాం. కొత్తగా టీఎస్‌పీఎస్సీ కమిషన్‌ను నియమించాం. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి అదనపు సిబ్బందిని ఇచ్చాం. టీఎస్‌పీఎస్సీకి ఇప్పటికే రూ.40 కోట్లు మంజూరు చేశాం. ఉద్యోగాల నోటిఫికేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. పదేళ్లుగా గ్రూప్-1 ఉద్యోగాల కోసం యువత ఎదురుచూశారు. యువత కలల సాకారం కోసం ప్రభుత్వం కృషిచేస్తుంది. - మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
గత ప్రభుత్వం దోచుకున్నది, దాచుకోవడం పైనే దృష్టి పెట్టింది : సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ ప్రణాళికా సంఘాలు ఏర్పాటు కాలేదు : కాగ్