TDP workshop with MLA MP candidates: సార్వత్రిక ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన అభ్యర్థులను ప్రకటించాయి. మరోవైపు బీజేపీ సైతం అభ్యర్థుల ప్రకటనపై కసరత్తు చేస్తోంది.షెడ్యూల్ విడుదలతో కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా ఎన్నికల వ్యూహాలను చర్చించేందుకు అభ్యర్థులతో తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో విజయవాడలో వర్క్ షాప్‌ను నిర్వహిస్తోంది.
మూడు పార్టీల పొత్తు జగన్‌ను ఓడించడం కోసమే కాదు - రాష్ట్రాన్ని గెలిపించడం కోసం : చంద్రబాబు
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడ అధ్వర్యంలో విజయవాడలోని ఎ కన్వెన్షన్‌లో ఈ రోజు ఉదయం 10 గంట లనుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఈ వర్క్ షాప్ జరుగుతుంది. ఈ వర్క్ షాప్‌నకు తెలుగు దేశం పార్టీ నుంచి లోక్ సభ, అసెంబ్లీకి అభ్యర్థులుగా ప్రకటించిన వారితో పాటు ఇతర నియోజకవర్గాల్లోని ఇంచార్జ్ లు కూడా పాల్గొంటారు. అభ్యర్థులతో పాటు ఎన్నికల కోసం వారు ప్రత్యేకంగా నియమించుకున్న నలుగురు మేనేజర్లు కూడా ఈ వర్క్ షాప్‌కు హాజరు అవుతారు. ఎన్నికల ప్రవర్తనా నియమావలి, అభ్యర్థులకు ఉండే హక్కులు, అధికార పార్టీ కుట్రలు వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరగుతుంది. ఎన్నికల్లో ప్రచారం, నామినేషన్ల దాఖలు వంటి అంశాలపైనా వర్క్ షాప్‌లో చర్చిస్తారు. మొత్తం ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు అనుసరించాల్సిన పద్దతులను, వ్యూహాలను ఈ సమావేశంలో వివరిస్తారు.