Pulivarthi Sudhareddy Fire : టీడీపీ కార్యకర్తలు తాము సొంత ఇళ్లకు వేసుకున్న పోస్టర్లపైనా వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారు. సొంత ఖర్చుతో ఇంటి గోడలకు వేసిన పోస్టర్లను అధికారులను పురమాయించి తొలగించారు. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించడంపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రగిరిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా చెవిరెడ్డి సొంత రాజ్యాంగం నడుస్తోందని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి ఆరోపించారు. వికృత చేష్టలు, వింత ఆలోచనలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
ఓటమి భయంతోనే టీడీపీ నేతలపై వైసీపీ దాడి - రాష్ట్రంలో జగన్ ఫ్యాక్షన్ పాలన : మునిరత్నంపై దాడిని ఖండించిన లోకేశ్
తిరుపతి రూరల్ మండలం మంగళం పంచాయతీలో మంగళవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదినం సందర్భంగా పులివర్తి నాని చిత్రాలతో ఉన్న పోస్టర్లను కార్యకర్తలు సొంత ఇళ్లకు వేసుకున్నారు. దీంతో పంచాయతీ అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వాటిని తొలగించారు. సమాచారం అందుకున్న పులివర్తి సుధారెడ్డి పంచాయితీ కార్యాలయానికి చేరుకుని ఎందుకు తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు.
చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతపై వైసీపీ అనుచరుల దాడి - వైసీపీ ఎమ్మెల్యే పరామర్శ
సుమారు మూడు గంటల పాటు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్ష పార్టీలకు మరో న్యాయమా అంటూ పులివర్తి సుధారెడ్డి అధికారులను నిలదీశారు. కనీసం సీఎంకు గౌరవం కూడా ఇవ్వకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరుతో నియోజకవర్గ వ్యాప్తంగా సిమెంట్ బల్లలు వేసుకున్నా పట్టించుకోని అధికారులకు తెలుగుదేశం పార్టీ పోస్టర్స్ బ్యానర్లు కనిపిస్తే తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. ఎందుకు తొలగించారో రిటర్న్ గా తెలియజేస్తే నిరసన విరమిస్తానని ఆమె భీష్మించుకున్నారు.
తర్జనభర్జనలు పడిన అధికారులు చివరకు రిటర్న్ గా తెలియజేశారు. దానికి జీవో కాపీ జత చేయాలని ఆమె కోరడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. మరో గంట పాటు ఆలస్యం చేసి చివరకు జీవో కాపీని ఇవ్వడంతో ఆమె నిరసన విరమించారు. అనంతరం సెక్రటరీ ఇచ్చిన జీవో కాపీని పరిశీలించి ఓ ప్రముఖ జర్నలిస్టు పంచాయతీ సెక్రటరీ ఇచ్చిన జీవో కాపీ లోని అంశాలను ప్రస్తావిస్తూ పంచాయతీ కార్యాలయం ఎదుట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫొటోను చూపిస్తూ ఈ జీవో వైసీపీ వాళ్లకు వర్తించందా అన్ని ప్రశ్నించారు. దీంతో కొందరు వైసీపీ నాయకులు ఆ జర్నలిస్టుపై దాడికి తెగబడ్డారు. పోలీసులు అడ్డుకోవడంతో సమస్య సద్దుమణిగింది.
టీడీపీ నేతపై వైసీపీ కార్యకర్తల దాడి, అదే పార్టీ ఎమ్మెల్యే పరామర్శ - ఇదెందయ్యా ఇది