ETV Bharat / politics

రేషన్ బియ్యం కేసులో నానికి మరోసారి నోటీసులు ఇస్తాం - కృష్ణా జిల్లా ఎస్పీ - PERNI NANI RATION RICE CASE

'రేషన్‌ బియ్యం మిస్సింగ్‌పై ఇప్పటికే కేసు నమోదు చేశాం - విచారణ త్వరగా పూర్తి చేసి కేసును కొలిక్కి తెస్తాం'

krishna_district_sp_gangadhar_responded_on_perni_nani_ration_rice_case
krishna_district_sp_gangadhar_responded_on_perni_nani_ration_rice_case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Krishna District SP Gangadhar Responded On Perni Nani Ration Rice Case : మాజీ మంత్రి పేర్ని నాని రేషన్‌ బియ్యం కేసు విచారణపై కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్‌ స్పందించారు. బియ్యం మాయం కేసులో వివరాలు ఉంటే ఇవ్వాలని పేర్ని నానికి నోటీసులు ఇచ్చామని స్పందించకపోవడంతో మరోసారి నోటీసులు ఇస్తామని వెల్లడించారు. రేషన్‌ బియ్యం మిస్సింగ్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామన్నారు. విచారణ త్వరగా పూర్తి చేసి కేసును కొలిక్కి తెస్తామని స్పష్టం చేశారు.

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నాని కుటుంబానికి చెందిన గిడ్డంగిలో రేషన్ బియ్యం మాయంపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గోదాములోని రేషన్ బియ్యాన్ని మచిలీపట్నంలోని మార్కెట్ యార్డుకు తరలించారు. వాటిని. పొట్లపాలెంలో పేర్ని నాని తన భార్య జయసుధ పేరుతో గోదాము నిర్మించి పౌరసరఫరాల శాఖకు లీజుకు ఇచ్చారు.

సదరు గోదాములో 185 టన్నుల రేషన్ బియ్యం మాయమవడంతో పేర్ని నాని సతీమణి జయసుధపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పౌర సరఫరాల శాఖ అధికారులు సంబంధిత గోదాములోని మిగిలిన రేషన్ బియ్యం నిల్వలను మచిలీపట్నం మార్కెట్ యార్డుకు తరలించారు. స్టాక్ మొత్తం ఖాళీ చేశాక ఆ గోడౌన్‌ను బ్లాక్ లిస్టులో పెట్టమని అధికారులు తెలిపారు.

అజ్ఞాతంలో పేర్ని నాని కుటుంబం! - ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు

వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం రేషన్ బియ్యం కుంభకోణంపై విచారణకు సిట్‌ ఏర్పాటు చేసేందుకు సిఫార్సు చేస్తానని మంత్రి కొల్లు రవీంద్ర ఇప్పటికే తెలిపారు. పేర్ని నాని పేదల బియ్యం మాయం చేసింది వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. గోదాములో బియ్యం నిల్వలు తగ్గాయని స్వయంగా ఆయనే ఒప్పుకున్నారని చెప్పారు. తప్పు చేయనపుడు దొంగలా తప్పించుకొని తిరగడం ఎందుకని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ కేసు విచారణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

గోదాములో పీడీఎస్ రైస్ మాయం! - మాజీ మంత్రి పేర్నినాని భార్యపై కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.