ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

సామాన్య వ్యక్తిగా ఎమ్మెల్యే - మోస్ట్ యాక్టివ్ ‘టూ వీలర్’గా గుర్తింపు - Galla Madhavi solving problems - GALLA MADHAVI SOLVING PROBLEMS

TDP MLA Galla Madhavi Solving Peoples Problems While Riding a Bike : ఎవరైనా ఎమ్మెల్యే తమ నియోజకవర్గానికి వెళ్లినప్పుడు ఉండే హంగామా అంతా ఇంతా కాదు. ఓ వైపు గన్​మెన్​లు, కార్యదర్శులు, పార్టీ కార్యకర్తలు, బారులు తీరిన కాన్వాయ్​లు, సైరన్ మోతలతో ఆ ప్రాంతం మారుమోగుతుంది. కానీ ఓ ఎమ్మెల్యే మాత్రం వాటన్నింటిని వదులుకోని ప్రజలకు సేవ చేయాలనే తపనతో ద్విచక్ర వాహనంపై గ్రౌండ్ లెవెల్‌లో పర్యటిస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఆ ఎమ్మెల్యే ఎవరో, ఎందుకు ఈ వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారో తెలుసుకుందామా.

MLA Galla Madhavi
MLA Galla Madhavi (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 18, 2024, 9:46 PM IST

TDP MLA Galla Madhavi Solving Peoples Problems While Riding a Bike : ఒక ఎమ్మెల్యే తమ నియోజకవర్గాన్ని సందర్శించినప్పుడల్లా గన్‌మెన్‌లు, వ్యక్తిగత కార్యదర్శులు, కొంతమంది నాయకులు వారి వెంట వస్తారు. అలాగే బారులు తీరిన కాన్వాయ్, సైరన్ మోతలు మారుమోగుతుంటాయి. అయితే ఇక్కడ ఓ ఎమ్మెల్యే మాత్రం ఆ విలాసాలన్నింటినీ వదులుకుని, సామాన్య వ్యక్తిగా ప్రజలతో మమేకమై, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజలకు సేవ చేయాలని వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. ఆమె గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి.

ప్రజలతో మమేకం కావాలనే ఉద్దేశ్యంతో మాధవి ప్రతిరోజు తన నియోజకవర్గంలోని డివిజన్లలో ద్విచక్ర వాహనంపై పర్యటిస్తున్నారు. ఆమె స్వయంగా టూవీలర్ నడుపుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉదయం 6 గంటలకు తన ఇంటి నుంచి బయలుదేరి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె నియోజకవర్గంలోని 18, 19, 23, 39 డివిజన్లలో పర్యటించారు.

వైసీపీ కవ్వింపుచర్యలతో కూటమి కార్యకర్తలు హద్దు మీరొద్దు: హోంమంత్రి అనిత - law and order at YCP government

"నేను గ్రౌండ్ లెవెల్‌లో పర్యటించడం ప్రారంభించినప్పుడు, గత ఐదేళ్లలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల గురించి తెలిసింది. అందుకే కారులో కాకుండా ద్విచక్ర వాహనంపై డివిజనల్ పర్యటనలు చేస్తున్నా. గెలిపిస్తే ప్రజలకు సేవకురాలిగా పని చేస్తానని ఎన్నికల ముందే చెప్పా. ప్రజలు ఆశీర్వదించి సేవ చేసే భాగ్యం కల్పించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి నెల రోజులు కావస్తున్నా స్థానిక అధికారులు ఇంకా గాఢనిద్రలోనే ఉన్నారు. వైసీపీ మోడ్ నుంచి బయటకు వచ్చి ప్రజలకు సేవ చేయడం ప్రారంభిస్తే బాగుంటుంది, లేకుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటాం. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల చిన్న పనులు చేసేందుకూ కాంట్రాక్టర్లు మందుకు రావడం లేదు. వైసీపీ ప్రభుత్వంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలపడానికి ఇదే ఉదాహరణ. వారి బిల్లులు సకాలంలో చెల్లిస్తామని నేను వారికి హామీ ఇచ్చాను. అప్పుడే వారు పనిని చేపట్టడానికి అంగీకరించారు" అని ఎమ్మెల్యే మధవి చెప్పారు.

'మాకు విశ్వాసం ఉంది - అందుకే ఐశ్వర్యం రొట్టె కోసం వచ్చాం' - Rottela Festival second Day

కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటున్న నారా లోకేశ్ - ప్రజాదర్బార్‌కు పోటెత్తిన జనం - Minister Nara Lokesh Praja Darbar

ABOUT THE AUTHOR

...view details