TDP Leaders Fire on Drugs in Visakha Port : బ్రెజిల్ శాంటోష్ పోర్ట్ నుంచి విశాఖ పోర్టుకు చేరుకున్న 25వేల కిలోల డ్రగ్స్ రాకెట్ పై సమగ్ర విచారణకు ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. విశాఖ పోర్టులో తనిఖీలకు వచ్చిన సీబీఐ, కస్టమ్స్ అధికారులను కంటైనర్ తెరవకుండా ఆపడానికి పోలీసులు ఎందుకు ప్రయత్నం చేశారని ఆయన ప్రశ్నించారు. రాజమండ్రిలోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడిన గోరంట్ల డ్రగ్స్ దిగుమతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ప్రభుత్వ పెద్దల హస్తం లేకుండానే ఇన్ని వేల కోట్ల మాదకద్రవ్యాలను డ్రై ఈస్ట్ పేరుతో దిగుమతి చేశారా అని ప్రశ్నించారు.
'సంధ్య ఆక్వా'లో సీబీఐ దాడులు - పట్టుబడింది ముడిసరుకు అంటున్న యాజమాన్యం - Visakha Drugs Case
చేపల మేత తయారీలో వినియోగించే డ్రైఈస్ట్ పేరుతో దిగుమతి చేసుకున్న కంపెనీ వ్యవహారాలు వెనక ఎవరున్నారు ? దీనికి కారకులు ఎవరు ? ఆ సంస్థ యజమానులు ఎవరో బయటకు తీయాలని గోరంట్ల డిమాండ్ చేశారు. వేల కిలోల వంతున డ్రగ్స్ రాష్ట్రానికి వస్తుంటే రాష్ట్రంలో యువత ఏమైపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీని డ్రగ్స్ రాజధానిగా మార్చేస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికలలో గెలవడం కోసం ప్రభుత్వమే డ్రగ్స్ రప్పించిందా ? అనే అనుమానాలు కలుగుతున్నాయని గోరంట్ల పేర్కొన్నారు. డ్రగ్స్ స్వాధీనం చేసుకునే సమయంలో ఏపీ పోలీసులు పోర్టు అధికారులు సహకరించకపోవడంతోనే ఏదో కుట్ర ఉందని, అందుకే డ్రగ్స్ వ్యవహారంపై మొత్తానికి సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీయాలని గోరంట్ల కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఇక రాజమండ్రిలో గాంజా, బ్లేడ్ బ్యాచ్ లను రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామే పోషిస్తున్నారని, తనకు ఏమీ సంబంధం లేని విషయంలో లాగితే ఊరుకునేది లేదని గోరంట్ల స్పష్టం చేశారు. గంజా కేసుల వ్యవహారంలో సిటీ నాయకులు మీరూ మీరూ పడండీ, మధ్యలో నన్నెందుకు లాగుతారని, గంజా కేసులో దొరికిన వ్యక్తి ఎంపీ అనుచరుడు కాదా అని ఆయన ప్రశ్నించారు. వారు చేసిన తప్పులను వేరొకరి మీదకు నెట్టేయడం వారికి అలవాటేనని ఎంపీ భరత్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖ డ్రగ్స్ కంటైనర్ కేసు - కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు - Visakhapatnam Drugs Container Case
గుజరాత్ లో దొరికన డ్రగ్స్ మూలాలు కూడా ఏపీలోనే ఉన్నాయని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. మత్తు పదార్ధాలు ఎక్కడ దొరికినా దానికి ఏపీలో మూలం ఉంటోందని అన్నారు. డ్రగ్స్ కంటైనర్ను తెరవనీయకుండా కొందరు వైసీపీ నేతలు అడ్డుపడ్డారంటేనే దాని వెనక ఎవరున్నారో అర్థం అవుతోందన్నారు. విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో ఇంటర్ పోల్ జోక్యం చేసుకుందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని తెలిపారు. అధికార పార్టీ అండ దండలతోనే ఈ మాఫియా చెలరేగుతోందన్నారు. ఆ మరకలు టీడీపీకి అంటించాలని చూస్తే కుదరదని బోండా ఉమామహేశ్వరరావు అన్నారు.
డ్రగ్స్ కంటైనర్ మా పరిధిలోకి రాదు - మా వల్ల సోదాలు ఆలస్యం కాలేదు: విశాఖ సీపీ - VISAKHA CP ON DRUGS CASE
విశాఖలో పట్టుబడిన 25 వేల కిలోల డ్రైడ్ ఈస్ట్ తో కలిపి ఉన్న డ్రగ్స్ సీబీఐకి పట్టుబడ్డాయని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. ఈ డ్రగ్స్ కంటైనర్ వైసీపీ నేత కూనం పూర్ణచంద్రరావు సోదరుడు వీరభధ్రరావుకి చెందిన సంధ్య ఆక్వా ఎక్స్ పోర్ట్ లిమిటెడ్ కంపెనీ దిగుమతి చేసుకుందని ఆయన ఆరోపించారు. కూనం పూర్ణచంద్రరావు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం వైసీపీ సీనియర్ నేత, అతడికి విజయసాయిరెడ్డితో సన్నిహిత సంబంధాలున్నాయని వెల్లడించారు. ఈ కంటైనర్ డ్రైడ్ ఈస్ట్ తో కలపబడివున్న మార్పిన్, కొకైన్, హెరాయిన్, యాంఫటేమిన్, మెస్కిలన్ వంటి భయంకర మత్తు పదార్థాలున్నాయని సీబీఐ తన నివేదికలో పేర్కొందని అన్నారు. ఈ మత్తు పదార్థాల విలువ సుమారు 50 వేల కోట్లు ఉండొచ్చని పట్టాభిరామ్ అంచనా వేశారు. కంటైనర్ తనిఖీ చేయకుండా కొందరు రాష్ట్ర ఉన్నతాధికారులు అడ్డుపడ్డారని సీబీఐ తన నివేదికలో పేర్కొంది. బ్రెజిల్ నుంచి మత్తు పదార్థాలు దిగుమతి చేస్తున్నారని తెలిసే జగన్ రెడ్డి తన అధికారులను పంపారా అని నిలదీశారు. బ్రెజిల్ అంటే ఎంపీ విజయసాయిరెడ్డికి ఎందుకంత ప్రేమ ? రెండేళ్ల క్రితం బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన లూలడా సిల్వకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గుర్తు చేశారు.
దేశాన్నే కుదిపేసిన ఘటన విశాఖలో జరిగింది: సాధినేని యామిని - SADINENI YAMINI ON VISAKHA DRUGS
గురువారం విశాఖపట్నంలో దొరికిన 25 వేల కేజీల డ్రగ్స్ మాఫియా వెనక వైసీపీ హస్తం ఉందంటూ నెటిజన్లు ట్విట్టర్లో (X లో) వేల సంఖ్యలో ట్వీట్లు చేస్తున్నారు. #JaganForDrugs హ్యాష్ టాగ్ దేశవ్యాప్తంగా 3వ స్థానంలో ట్రెండ్ అవుతోంది. గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో పట్టుబడ్డ వేల కోట్ల విలువ చేసే గంజాయి, డ్రగ్స్ కు సంబంధించిన వార్తా కథనాలను ఉటంకిస్తూ నిన్న విశాఖలో దొరికిన డ్రగ్స్ వెనక కూడా వైసీపీ పెద్దల హస్తమే ఉందంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
విశాఖ తీరంలో భారీ డ్రగ్స్ పట్టివేతపై చంద్రబాబు, పవన్ స్పందన- జగన్ సర్కార్ సమాధానం చెప్పాలని డిమాండ్