ఏపీలో హీటెక్కిన రాజకీయం - చంద్రబాబు సభలోనూ రాళ్లు విసిరిన దుండగులు Stones Thrown on Chandrababu : విశాఖపట్నం జిల్లా గాజువాకలో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం సభలో రాయి దాడి కలకలం రేపింది. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ప్రజాగళం వాహనం వెనుక నుంచి ఓ ఆగంతకుడు రాయి విసిరి పరారయ్యాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు రాయి విసిరిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
వారాహి యాత్రలో కలకలం- పవన్ కల్యాణ్‌పై రాయి విసిరిన గుర్తుతెలియని వ్యక్తి - Attack On Pawan Kalyan Varahi Yatra
తనపై రాయితో దాడికి యత్నించిన ఘటనపై చంద్రబాబు స్పందించారు. నిన్న చీకట్లో సీఎంపై గులకరాయి పడిందని కానీ, ఇప్పుడు కరెంటు ఉన్నప్పుడే తనపై రాయి విసిరారని అన్నారు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఈ పని చేస్తోందని మండిపడ్డారు. తెనాలిలో వారాహి యాత్రలో పవన్ కల్యాణ్‌పై కూడా రాళ్లు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడలో జగన్‌పై జరిగిన రాయి దాడి డ్రామా గురించి కూడా తేలుస్తానంటూ చంద్రబాబు హెచ్చరించారు. గత ఎన్నికలప్పుడు కూడా తనపై రాళ్లు వేశారన్న ఆయన, క్లైమోర్ మైన్స్‌కే భయపడలేదని, ఈ రాళ్లకు భయపడతానా అని పేర్కొన్నారు. నిన్న సీఎంపైన చీకట్లో గులకరాయి పడింది. జగన్ సభలో కరెంటు పోయింది. దీనికి ఎవరు బాధ్యత వహించాలని చంద్రబాబు ప్రశ్నించారు. కరెంట్ బంద్ చేసిన వారిపై, రాళ్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ పోలీసులు, ఇంటెలిజెన్స్ సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దాడులు చేస్తే చూస్తూ ఉండటానికే పోలీసులు ఉన్నారా అని మండిపడ్డారు.
జగన్ ఒకప్పుడు కోడికత్తి డ్రామా ఆడారన్న చంద్రబాబు, అదే విధంగా బాబాయి హత్యను తన మీదకు నెట్టాలని ప్రయత్నించారని అన్నారు. విజయవాడలో జగన్‌పై జరిగిన రాయి దాడి ఘటనను అందరం ఖండించామన్న చంద్రబాబు, పేటీఎం బ్యాచ్ కుక్కలు ఇష్టానుసారంగా మొరిగాయని ధ్వజమెత్తారు. రాళ్లు తానే వేయించినట్లు కొందరు మాట్లాడారని’ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈటీవీ విశ్వసనీయత దెబ్బతీసేలా వైసీపీ తప్పుడు వీడియోలు - ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలి : చంద్రబాబు - CBN ON FAKE VIDEOS
వైసీపీది రౌడీయిజం - ఓటమి భయంతోనే హింసా రాజకీయాలు : చంద్రబాబు - Chandrababu Slams YSRCP