Rahul Gandhi Contests from Telangana in Lok Sabha Elections 2024 :కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్లమెంటు ఎన్నికల్లో ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు నిర్ణయం జరిగినట్లు కాంగ్రెస్ ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్, అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేసింది. తెలంగాణ నుంచి రాహుల్ (Rahul Gandhi) పోటీ చేస్తే పార్టీపై మరింత ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ వర్గాలు ఆశాజనకంగా ఉన్నాయి.
ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొన్నాళ్ల క్రితం ఆమెను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య కారణాల రీత్యా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయదలచుకోలేదని, నియోజకవర్గానికి న్యాయం చేయలేనని ఆమె పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రం నుంచి రాజ్యసభ (Rajya Sabha) సభ్యురాలిగా నిలవాలని సూచించినా, సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి ఎగువసభకు వెళ్లారు. ఈ క్రమంలో రాహుల్‌గాంధీ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం కేరళలోని వయనాడ్ ఎంపీగా (Wayanad MP) ఉన్న రాహుల్‌ను ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేయించే అంశంపై పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులతో ముఖ్యమంత్రి చర్చించినట్లు తెలిసింది.
ప్రియాంకాగాంధీ తెలంగాణ పర్యటన రద్దు - వర్చువల్‌గా 2 పథకాల ప్రారంభానికి ఏర్పాట్లు