Police Arrested BRS Leader In Osmania University Issue :ఉస్మానియా విశ్వవిద్యాలయం మెస్‌ల మూసివేతపై దుష్ప్రచారం కేసులో బీఆర్ఎస్ నేత క్రిశాంక్, ఓయూ విద్యార్థి నాగేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వెళ్తుండగా పంతంగి టోల్గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
యూనివర్శిటీ ప్రతిష్ఠకు బంగం కలిందన్న అధికారులు :ప్రతి ఏటా వసతి గృహాల మెస్‌ల మూసివేతపై ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు సర్క్యులర్ జారీ చేస్తుంటారు. ఈ ఏడాది కూడా అధికారులు సర్క్యులర్ జారీ చేయగా వాటిపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసి యూనివర్శిటీ ప్రతిష్ఠకు భంగం కలిగించినట్లు ఓయూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి క్రిశాంక్, నాగేందర్లను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిని ఓయూ పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నట్లుగా సమాచారం.
Jagadeesh Reddy Fires On CM Revanth :మరోవైపుక్రిశాంక్, నాగేందర్‌ల అరెస్టుపై బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి స్పందించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమి ఖాయమైందని గెలవలేమని తెలిసే పోలీసులను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. అందులో భాగంగానే క్రిశాంక్‌ను అరెస్టు చేశారన్నారు. అసలు క్రిశాంక్‌ను అరెస్టు చేశారో లేక ఎవరైనా కిడ్నాప్ చేశారో తెలియడం లేదని దీనిపై డీజీపీ సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. పోలీసులే కాంగ్రెస్ కార్యకర్తలుగా పని చేస్తున్నారని ఆరోపించారు. కేసులు ఉపసంహరించుకోవాలంటే మంత్రులను కలవాలని పోలీసులు చెప్పడం సిగ్గు చేటన్నారు. ఒక్క నోటీస్‌కే ఇవాళ ముఖ్యమంత్రి భయపడి పోయాడని, నోటీసులు రాగానే రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యం గురుంచి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.