No Action Against MLA Pinnelli Till June 6:మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 6 వరకు ఎలాంటి చర్యలు చేపట్టొద్దని హైకోర్టు ఆదేశించింది. ఈవీఎం ధ్వంసం కేసులో జూన్ 6వరకు పిన్నెల్లిని అరెస్టు చేయొద్దంటూ ఇప్పటికే ధర్మాసనం ఆదేశింది. మాచర్ల హింసలో పోలీసులు నమోదు చేసిన కేసుల్లోనూ ఆ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. ఈవీఎం ధ్వంసం కేసులో జూన్ 6 వరకు అరెస్టు చేయవద్దని గతంలో హైకోర్టు స్పష్టం చేసింది.
Pinnelli Anticipatory Bail :పాల్వయిగేటు పోలింగ్ బూత్‌లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తుండగా అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడారు. ఈవీఎం ధ్వంసం చేసి బయటకు వస్తున్న సమయంలో ఓ మహిళపై దుర్భాషలాడారు. కారంపూడిలో సీఐపై దాడి చేసిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసు నమోదైంది. ఈ మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు.
పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఉద్దేశపూర్వకంగానే పిటిషనర్‌పై బహుళ ఎఫ్ఐఆర్లు నమోదు చేశారన్నారు. ఈవీఎంను పగలగొట్టిన కేసులో జూన్ 6 వరకు అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నెరవేరకుండా పోలీసులు చూస్తున్నారన్నారు. పోలీసుల తరఫున పీపీ వై.నాగిరెడ్డి వాదనలు వినిపించారు. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించే సమయంలో హైకోర్టు విధించిన షరతులను పిన్నెల్లి ఉల్లంఘించారన్నారు.
'ఓట్ల లెక్కింపు రోజున తీవ్ర అల్లర్లకు కుట్ర- పిన్నెల్లి బెయిల్‌కు అనర్హుడు' - MLA Pinnelli Case