Minister Kollu Ravindra serious on Ravindranath Babu Issue: నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారానికి కృష్ణా జిల్లా మాజీ ఎస్పీ రవీంద్రనాథ్ బాబును ఆహ్వానించడంపై మంత్రి కొల్లు రవీంద్ర అసహనం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో కొల్లు రవీంద్రపై తప్పుడు కేసు బనాయించి రవీంద్రనాథ్ బాబు అరెస్టు చేశారు. తనను తన కుటుంబాన్ని వేధించిన వ్యక్తితో అంటకాగుతూ తనని అవమానిస్తారా అని మంత్రి ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ నేతలకు తొత్తులా పని చేసిన వ్యక్తిని సభకు ఆహ్వానించడం బాధ కలిగించిందని వ్యాఖ్యానించారు.
తన మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన వారిపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. విజయవాడ తుమ్మలపల్లిలో జరిగిన ప్రమాణ స్వీకారానికి మంత్రి కొల్లు రవీంద్రకు ఆహ్వానం అందింది. మంత్రి కొల్లు రవీంద్ర అనివార్య కారణాల వల్ల కార్యక్రమానికి హాజరుకాలేదు. ఈ ఉదయం కార్యక్రమానికి హాజరైన అతిథుల్లో రవీంద్రనాథ్ బాబు ఉన్నారనే విషయం తెలుసుకుని మంత్రి కొల్లు రవీంద్ర అసహనం వ్యక్తం చేశారు.
ఫేస్‌బుక్ పరిచయం - ఉద్యోగం పేరుతో రూ.23లక్షలు దోచుకున్న మోసగాడు
ఏపీలో నూతన శకం- వాట్సప్ గవర్నెన్స్‌కు రాష్ట్రప్రభుత్వం శ్రీకారం