ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

కోనసీమను వైసీపీ కలహాల సీమగా మార్చే యత్నం చేసింది- పవన్‌ కల్యాణ్‌ - Pawan Kalyan at Prajagalam - PAWAN KALYAN AT PRAJAGALAM

Pawan Kalyan Comments on YS Jagan: కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. ఐదు కోట్ల మంది ప్రజలను కాపాడేందుకే ఏపీలో ఎన్డీయే కూటమి ఏర్పడిందన్నారు. త్రివేణి సంగమంలా టీడీపీ, జనసేన, బీజేపీ పనిచేస్తాయన్న పవన్, కోనసీమలో కొబ్బరి, వరి రైతులకు కూటమి అండగా ఉంటుందని పేర్కొన్నారు.

Pawan Kalyan  Comments on YS Jagan
Pawan Kalyan Comments on YS Jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 11, 2024, 8:29 PM IST

Pawan Kalyan Comments on YS Jagan: కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో ప్రజాగళం బహిరంగ సభ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కులాలు దాటి మతాలు దాటి రాజకీయాలు చేయాలని పిలుపునిచ్చారు. తాను ఎదైనా మాట్లాడితే తన కులం నేతలతో తిట్టిస్తారని ఆరోపించారు.

సీఎం జగన్ కోనసీమను కలహాల సీమగా మార్చేందుకు యత్నించారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఆరోపించారు. తాము మాత్రం కోనసీమను ప్రేమ సీమగా మార్చేందుకు యత్నించామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ది కోసం త్రివేణి సంగమంలా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేస్తోందని పవన్‌ వెల్లడించారు. వైసీపీ నుంచి ఐదు కోట్ల మంది ప్రజలను కాపాడేందుకు కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఇది రైతు కన్నీరు తుడిచే కూటమి అవుతుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇక్కడ రూ.200 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారని ఎంత ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పనపల్లి లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు రూ.40 కోట్లు ఇస్తామన్న హామీ ఏమైందని పవన్‌ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో ఆడబిడ్డలకు భద్రత లేదని, మనకు భద్రత కల్పించలేని ప్రభుత్వం కావాలా అనేది ఆలోచించాలని పవన్ సూచించారు.


కొబ్బరి ఆధారిత పరిశ్రమలకు చేయుత- అంబాజీపేటలో చంద్రబాబు - Chandrababu Naidu Election Campaign

కొబ్బరి, వరి రైతులకు కూటమి నేతలు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. కౌలురైతులకు అండగా నిలబడ్డామని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. కోనసీమకు కొబ్బరి అనుబంధ పరిశ్రమలు రావాల్సిన అసరం ఉందని పవన్‌ పేర్కొన్నారు. రైతుభరోసా కేంద్రాలు కాకినాడ మాఫియా డాన్‌ చేతుల్లోకి వెళ్లాయని పవన్‌ దుయ్యబట్టారు. యువతకు ఉపాధి అవకాశాల కోసం నైపుణ్య శిక్షణ ఇస్తామని పవన్‌ హామీ ఇచ్చారు. కోనసీమ వాసులకు రైలుకూత వినిపించే వరకు కష్టపడతామని పవన్‌ పేర్కొన్నారు. సర్ ఆర్ధర్ కాటన్ మాదిరిగా కూటమి నేతలు పని చేస్తారని తెలిపారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని పవన్‌ హామీ ఇచ్చారు. లిఫ్ట్ ఇరిగెషన్ చేసి నీరు అందించే ప్రయత్నాలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు.

తప్పులు చేసే వారిని ఎవ్వరినీ వదలబోమని పవన్ హెచ్చరించారు. ఇక్కడి విద్యార్థులు విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే ఉపాధి పొందేలా కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్రానికి పెద్దన్నలా చంద్రబాబు ముందుకు సాగుతారని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వంలో యువత స్కిల్స్ డెవలప్ మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గత పది సంవత్సరాలుగా ప్రజల కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. తన ప్రయత్నాన్ని చూసిన తన అన్నయ పార్టీ కోసం రూ. 5 కోట్ల విరాళం ఇచ్చారని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపబోమని హామీ ఇచ్చారు.

ఈ కూటమి రైతు కన్నీరు తుడిచే కూటమి అవుతుంది: పవన్‌ కల్యాణ్‌

ABOUT THE AUTHOR

...view details