Pawan Kalyan Comments on Tuni Train Incident in Kakinada District :తుని రైలు దహనం వైఎస్సార్సీపీ కుట్రేనని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆరోపించారు. కాపు రిజర్వేషన్లు రావని తెలిసినా కావాలనే కొందరు వైఎస్సార్సీపీ నేతలు కాపు యువతని ఎగదోశారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ కిరాయి మూకల్ని పెట్టి రైలుని తగలబెట్టించారని ఆరోపించారు. అదే సమయంలో కాపుల్ని తాకట్టు పెట్టే స్థాయి ఉంటే తానెందుకు ఓడిపోతానని ప్రశ్నించారు.
Pawan Election Campaign :కాకినాడ జిల్లా జగ్గంపేటలో నిర్వహించిన వారాహి విజయ యాత్రలో పాల్గొన్న పవన్‌కల్యాణ్ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్సార్సీపీ సర్కార్ ఒక అరటి పండు తొక్క ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. పోలవరం కాల్వల మట్టిని వైఎస్సార్సీపీ నాయకులు దోచేస్తున్నారని పవన్ ధ్వజమెత్తారు. కాల్వ గట్లను సైతం వదలట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఇంత జరుగుతున్నా జలవనరులశాఖ ఏం చేయలేకపోతోందని ఆరోపించారు.
వైఎస్సార్సీపీ నాయకులు వందల ఎకరాల్లో చెరువులు కబ్జా చేశారన్నారు. కనీసం కొండను కూడా మిగలకుండా చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పుష్కర ఎత్తిపోతల పథకానికి నిధులు లేక 60 వేల ఎకరాలు బీడుగా మారిందని పవన్ అన్నారు. కిర్లంపూడిలోని రవాణా, చిరువ్యాపారులు, ఫుట్‌పాత్ వ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉచిత విద్యుత్ అని చెప్పిన జగన్ ఎస్సీ, ఎస్టీలను మోసం చేశారని ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్‌లో ధర్మానిదే విజయం - పొత్తుదే గెలుపు - కూటమిదే పీఠం : పవన్ కల్యాణ్