MP Vemireddy Prabhakar Reddy Resigned to YSRCP : రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. అలాగే నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్ష పదవినీ వదులుకున్నారు. తన ఎంపీ పదవికి కూడా రాజీనామా సమర్పిస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. వైసీపీకి చేసిన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని సీఎం జగన్(CM Jagan)ను వేమిరెడ్డి కోరారు.
NelloreYSRCP Politics :రాష్ట్రంలో ఎన్నికల సమయం(AP Elections 2024) దగ్గరపడుతుండగా నెల్లూరు రాజకీయాలు వేడెక్కాయి. ఊహించని మలుపులు తిరుగుతూ జిల్లాలోని రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి గందరగోళంగా మారింది. ఇప్పటికే ఈ జిల్లాలో పలువురు కీలక నేతలు పార్టీని వీడి టీడీపీలో చేరగా, తాజాగా వేమిరెడ్డి రాజీనామాతో వైసీపీకి గట్టి షాక్ తగిలింది.