గెలిపే లక్ష్యంగా - కూటమి అభ్యర్థుల ఎన్నకల ప్రచారం NDA Candidates Election Campaign :ఊరూరా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ అరాచకాలు, వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ కూటమి అభ్యర్థులు ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కూటమి అభ్యర్థులకు ప్రజల్లో విశేష స్పందన లభిస్తోంది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరుతున్నారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డ కూటమి అభ్యర్ధి మండలి బుద్ధప్రసాద్ నాగాయలంక, చల్లపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. పామర్రు కూటమి అభ్యర్థి వర్ల కుమార్ రాజా, మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరి మొవ్వ మండలం అవిరిపూడి, పాలంకిపాడులో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం, ముక్త్యాల, కె.అగ్రహారంలో కూటమి అభ్యర్థి రాజగోపాల్ తాతయ్య ప్రచారం చేశారు. నారా లోకేష్‌కు మద్దతుగా గుంటూరు జిల్లా మంగళగిరిలో రాజధాని రైతులు ప్రచారం నిర్వహించారు.
సీఎం జగన్ బడుగు, బలహీన వర్గాలకు తీరని అన్యాయం చేశారని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులో జరిగిన బీసీ సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని, ఎమ్మెల్యే అభ్యర్థులు గల్లా మాధవి, నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం కొటికలపూడిలో కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ప్రచారం చేశారు. పర్చూరు కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు కారంచేడు మండలం కుంకలమర్రులో ఎడ్ల బండిపై రోడ్డు షో నిర్వహించారు.
జగన్ వ్యవస్థలన్నింటినీ నాశనం చేశాడు- రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాడు : బాలకృష్ణ - NBK Swarnandhra Sakara Yatra
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం పందిటివారిపాలెంలో గురజాల కూటమి అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు ప్రచారంలో పాల్గొన్నారు. నరసరావుపేట పార్లమెంట్ కూటమి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు రొంపిచర్ల మండలంలో ప్రచారం నిర్వహించారు. ఒంగోలు పార్లమెంట్ కూటమి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి జనార్ధన్‌లకు మద్దతుగా పట్టణంలోని రంగరాయ చెరువు కట్టమీద మహిళలు ప్రచారం చేశారు. దర్శి మండలం రాజంపల్లి గ్రామానికి చెందిన 20 కుటుంబాలు వైసీపీను వీడి టీడీపీలో చేరాయి. గిద్దలూరులో కూటమి అభ్యర్థి అశోక్ రెడ్డి ప్రచారం చేశారు.
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలోని పలు గ్రామాలల్లో కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ కుమార్తె రంగప్రియ ప్రచారం నిర్వహించారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం రామసింగవరం, కొత్తగూడెం, జి. కొత్తపల్లిలో గోపాలపురం కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు ఓట్లు అభ్యర్థించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం కూటమి అభ్యర్థి బుచ్చిబాబు సమక్షంలో చింతలమెరక గ్రామానికి చెందిన 40 కుటుంబాలు టీడీపీలో చేరాయి.
ఓట్ల వేటలో దూకుడు పెంచిన కూటమి అభ్యర్థులు - జోరుగా ఇంటింటి ప్రచారాలు - NDA Candidates Election Campaign
కర్నూలులో అసెంబ్లీ కూటమి అభ్యర్థి టీజీ భరత్, పాణ్యంలో సీపీఎం అభ్యర్థి గౌస్ దేశాయ్, నంద్యాలలోని 36 వార్డులో అసెంబ్లీ కూటమి అభ్యర్థి ఫరూక్ ప్రచారం చేశారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కొప్పలకొండలో శింగనమల కూటమి అభ్యర్థి బండారు శ్రావణి సోదరి కిన్నెరశ్రీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. కళ్యాణదుర్గంలో అమిలినేని సురేంద్రబాబు, బొమ్మనహాళ్ మండలంలో కాలవ శ్రీనివాసులు ప్రచారం చేశారు.
తిరుపతిలోని పలు ప్రాంతాల్లో పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ ప్రచారం నిర్వహించారు. తిరుపతి సమీపంలోని మంగళంలో కూటమి అభ్యర్ధి ఆరణి శ్రీనివాసులును గెలిపించాలంటూ కూటమి నాయకులు, కార్యకర్తలు ఓట్లు అభ్యర్ధించారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో దాదాపు 100 కుటుంబాలు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరాయి.
విశాఖ తూర్పు కూటమి అభ్యర్ధి వెలగపూడి రామకృష్ణబాబుకి మద్దతుగా ఎంపీ అభ్యర్ధి భరత్ సతీమణి, బాలకృష్ణ కుమార్తె తేజస్విని ప్రచారం చేశారు. విజయనగరం జిల్లా రాజాం మండలంలోని పలు గ్రామాల్లో కూటమి అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ ఓట్లు అభ్యర్ధించారు. శ్రీకాకుళంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా టీడీపీలో చేరారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండలో కూటమి అభ్యర్థి జయకృష్ణకు మద్దతుగా నటుడు పృధ్వీరాజ్ ప్రచారం చేశారు.
అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలే ఎజెండా - కూటమి అభ్యర్థులు సుజనా, కేశినేని విస్తృత ప్రచారం - NDA Leaders Election Campaign